LOADING...
MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్ 
మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్

MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం "మన శంకర వరప్రసాద్" షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. గతంలో "సంక్రాంతికి వస్తున్నాం" వంటి హిట్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు చివరికి నిజమయ్యాయి.

వివరాలు 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 

ఈవిషయాన్ని మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. తాజాగా వెంకీ మామ సెట్స్‌లో అడుగు పెట్టిన సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌, చిన్న ప్రోమోను విడుదల చేశారు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నవిక్టరీ వెంకీ,మెగాస్టార్ చిరు ఓకే సినిమాలో కలిసి నటించలేదు. ఈ ఇద్దరు సూపర్‌స్టార్లను ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతున్నాడు హిట్‌మిషన్‌ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి. సెట్స్‌లో వెంకటేష్ ప్రవేశం సందర్భంగా చిరంజీవి"వెల్కమ్ వెంకీ, మై బ్రదర్!"అని పలకగా, వెంకటేష్"మై డియర్ చిరు,మై బాస్!"అంటూ స్పందించిన ఆ గ్లింప్స్‌కు భీమ్స్ సీసిరోలియో సమకూర్చిన సంగీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న"మన శంకర వరప్రసాద్"సినిమా,రాబోయే సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిరంజీవి చేసిన ట్వీట్