Loading...
Koffee with Karan Season 9: 'కాఫీ విత్‌ కరణ్‌'లో విజయ్‌, రష్మిక.. ఈసారి కపుల్‌గా ఎంట్రీ!
'కాఫీ విత్‌ కరణ్‌'లో విజయ్‌, రష్మిక.. ఈసారి కపుల్‌గా ఎంట్రీ!

Koffee with Karan Season 9: 'కాఫీ విత్‌ కరణ్‌'లో విజయ్‌, రష్మిక.. ఈసారి కపుల్‌గా ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్‌ షో 'కాఫీ విత్‌ కరణ్‌' సీజన్‌ 9 త్వరలోనే ప్రారంభం కానుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ దీపావళి నుంచే తొలి ఎపిసోడ్‌ ప్రసారం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సీజన్‌లో టాలీవుడ్‌ నుంచి విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్‌ హాజరుకానున్నట్లు వార్తలొచ్చాయి. అయితే విజయ్‌ దేవరకొండతో పాటు ఆయన భార్య, స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మంధన్న కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు 'గీత గోవిందం', 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రాల్లో జంటగా నటించిన విజయ్‌ దేవరకొండ, రశ్మిక.. పెళ్లైన తర్వాత తొలిసారి 'రణబాలి'లో కలిసి కనిపించబోతున్నారు.

వివరాలు

16న  రణబలి రిలీజ్

ఈ సినిమా ఇదే నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో 'రణబాలి' సినిమా అనుభవాలతో పాటు ఈ స్టార్‌ కపుల్‌ లవ్‌ జర్నీ గురించి కూడా కరణ్‌ జోహార్‌ తన షోలో విపులంగా మాట్లాడించనున్నట్లు సమాచారం.

అందుకే త్వరలోనే ముంబైలో విజయ్‌, రష్మికల ఎపిసోడ్‌ షూటింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే 'కాఫీ విత్‌ కరణ్‌'లో విజయ్‌ దేవరకొండ, రశ్మిక కలిసి పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారి. కానీ విజయ్‌ గతంలోనే ఈ షోలో కనిపించాడు.

'కాఫీ విత్‌ కరణ్‌' సీజన్‌ 7లో 'లైగర్‌' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్‌ అనన్య పాండేతో కలిసి విజయ్‌ ఈ షోకు హాజరయ్యాడు. ఆ సమయంలో కరణ్‌ జోహార్‌ విజయ్‌ను ఇంటర్వ్యూ చేశాడు.

వివరాలు

సీజన్‌ 9లో అతిథులు వీరే!

అంటే కరణ్‌ అడిగే ఆసక్తికరమైన ప్రశ్నలకు విజయ్‌ సమాధానాలు చెప్పడం ఇది రెండోసారి కానుంది. 'కాఫీ విత్‌ కరణ్‌'కు సీజన్‌ 9తో ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇదే ఈ షోకు చివరి సీజన్‌ కానుందని సమాచారం. అందుకే ఈ సీజన్‌ను కరణ్‌ జోహార్‌ చాలా స్పెషల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మంధన్న, అల్లు అర్జున్‌తో పాటు ఈసారి బాలీవుడ్‌ క్రేజీ హీరోలు విక్కీ కౌశల్‌, దిల్జీత్‌ దోసాంజీ కూడా కలిసి పాల్గొనబోతున్నారని సమాచారం.

అలాగే 'దిల్‌ చాహ్‌తా హై' సినిమా విడుదలై 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆమిర్‌ ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, ఫర్హాన్‌ అక్తర్‌, అక్షయ్‌ ఖన్నాతో కలిసి కరణ్‌ జోహార్‌ ఓ ప్రత్యేక ఎపిసోడ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

జయ బచ్చన్‌తో ఓ స్పెషల్‌ షో నిర్వహించనున్నట్లు సమాచారం

అదే విధంగా 'కభీ ఖుషీ కభీ గమ్‌' సినిమా కూడా 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో కాజోల్‌, కరీనా కపూర్‌ ఖాన్‌, జయ బచ్చన్‌తో ఓ స్పెషల్‌ షో నిర్వహించనున్నట్లు సమాచారం.

మరోవైపు అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవ్‌గన్‌ 'గోల్‌మాల్‌ 5'లో కలిసి నటిస్తున్న నేపథ్యంలో వీరిద్దరితోనూ ఓ ఎపిసోడ్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌, సమయ్‌ రైనా, ఫరా ఖాన్‌, అనన్య పాండే, షనయా కపూర్‌, లక్ష్య, జాన్వీ కపూర్‌ కూడా 'కాఫీ విత్‌ కరణ్‌' సీజన్‌ 9లో పాల్గొనబోతున్నారని సమాచారం.

కరణ్‌ జోహార్‌.. తన షోకు ఇదే చివరి సీజన్‌ అయితే, ఎలాంటి ఆసక్తికర విషయాలు అడుగుతాడో అన్న ఆసక్తి మొదలైంది.

ADVERTISEMENT