పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారని గతంలో చాలా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే అయినా, వీరిపై రూమర్లు మాత్రం లెక్కలేనన్ని వస్తుంటాయి.
అయితే గత కొన్ని రోజులుగా విజయ్, రష్మికల టాపిక్ చర్చల్లోకి రాలేదు. తాజాగా కాఫీషాపులో కనిపించడంలో వీరి రిలేషన్ పై రూమర్లు గుప్పుమంటున్నాయి.
హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఒక కాఫీ షాప్ లో విజయ్, రష్మిక కలుసుకున్నారు. వీరిద్దరితో పాటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా ఉన్నారు.
నిన్న మద్యాహ్నం విజయ్ తో గౌతమ్ తిన్ననూరి సినిమా ప్రారంభమైంది. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కాఫీ షాప్ లో విజయ్, రష్మిక కలుసుకున్నారని సమాచారం.
Details
స్నేహం మాత్రమే ఉందని చెప్పిన విజయ్ దేవరకొండ
తమపై వచ్చిన రూమర్లపై గతంలో స్పందించిన విజయ్ దేవరకొండ, రష్మికతో స్నేహం మాత్రమే ఉందని, ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చాడు. రష్మిక కూడా అదే మాటను రిపీట్ చేసింది.
రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 చిత్రంలో కనిపిస్తోంది. అలాగే తెలుగు, తమిళంలో రూపొందుతున్న రెయిన్ బో చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో మరో చిత్రం చేస్తుంది.
విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, ఖుషి చిత్ర షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోంది.
ఈ రెండు సినిమాలు ముగియగానే దర్శకుడు పరశురామ్ తో సినిమా మొదలు పెట్టనున్నాడు.