విజయ్ దేవరకొండ బర్త్ డే: విజయ్ కెరీర్లో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు
విజయ్ దేవరకొండ.. రౌడీ స్టార్.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ గా నిలబడిన హీరో. ఈరోజు విజయ్ పుట్టినరోజు. నేటితో 35వ వడిలోకి అడుగుపెడుతున్నాడు విజయ్. అర్జున్ రెడ్డి సినిమాతో అభిమానులను సంపాదించుకున్న హీరో కెరీర్లోని ఎవ్వరికీ తెలియని విషయాల గురించి మాట్లాడుకుందాం. పుట్టపర్తిలోని సత్యసాయి బాబా స్కూల్ లో హైస్కూల్ వరకు చదివాడు విజయ్. స్కూల్ టైమ్ లో సత్యసాయి బాబా కోసం చేసిన యాడ్ షూట్ లో నటించాడు. రవిబాబు ఇచ్చిన అవకాశం: రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో అవకాశం వచ్చింది.
థియేటర్ ను కట్టించిన విజయ్
పెళ్ళి చూపులు సినిమాతో మంచి విజయం అందుకున్న విజయ్, ఆ తరువాత వరుసగా ఒకేసారి 9సినిమాలకు సైన్ చేసాడట. ఆ తొమ్మిదిలోంచి అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. స్టార్ గా మారిన విజయ్, కరోనా సమయంలో పేదలకు సహాయం చేయడానికి ట్రస్ట్ ఏర్పాటు చేసాడు. దాని ద్వారా చాలామందికి ఆర్థిక సాయం అందించాడు. బట్టల వ్యాపారంలో అడుగు పెట్టి రౌడీ బ్రాండ్ ను ఏర్పాటు చేసాడు. తన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ లో ఏవీడీ అనే సినిమా థియేటర్ ను కట్టించాడు. హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్నాక, మహానటి, మీకు మాత్రమే చెప్తా, జాతిరత్నాలు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల్లో అతిథిగా కనిపించాడు.