విజయ్ దేవరకొండ ఫిలిమ్ ఫేర్ అవార్డును ఎందుకు వేలం వేసాడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా ఎవ్వరైనా తమకు వచ్చిన మొదటి అవార్డును తమ ఇంట్లో దాచిపెట్టుకుంటారు. ఫస్ట్ అనేది చాలా విలువైనదని అందరూ అనుకుంటారు. కానీ విజయ్ దేవరకొండ స్టైలే వేరు.
అర్జున్ రెడ్డి సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ విభాగంలో తనకు వచ్చిన మొట్టమొదటి ఫిలిమ్ ఫేర్ అవార్డును వేలం వేసాడు విజయ్.
ప్రముఖ ఫార్మా కంపెనీ దివిస్ ల్యాబోరేటరీస్ అధినేత కిరణ్, ఆయన సతీమణి శకుంతల.. విజయ్ వేలం వేసిన ఫిలిమ్ ఫేర్ అవార్డును 25లక్షలకు దక్కించుకున్నారు.
వేలం ద్వారా వచ్చిన 25లక్షల రూపాయలకు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయనిధికి (సీఎమ్ఆర్ఎఫ్) అందజేసాడు విజయ్.
వేలం జరిగిన సమయంలోనే తన రౌడీ బ్రాండ్ ని అనౌన్స్ చేసాడు.
Details
అర్జున్ రెడ్డికి 5లక్షల పారితోషికం
వేలం జరిగిన అనంతరం మాట్లాడిన విజయ్, అర్జున్ రెడ్డి సినిమాలో నటించినందుకు 5లక్షల రూపాయల పారితోషికాన్ని దర్శకుడు సందీప్ వంగా ఇచ్చారనీ, ఫిలిమ్ ఫేర్ అవార్డు వేలం వేస్తే 5లక్షలు వస్తే చాలనుకున్నాననీ, కానీ దివిస్ అధినేతలు అంతకంటే చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పుకొచ్చాడు.
2017 ఆగస్టు 25వ తేదీన రిలీజైన అర్జున్ రెడ్డి, బాక్సాఫీసు వద్ద సునామీని సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో అటు దర్శకుడు సందీప్ వంగా స్టార్ దర్శకుల జాబీతాలో చేరిపోయాడు. ఇటు విజయ్ దేవరకొండ స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకున్నాడు.
ఇందులో నటించిన రాహుల్ రామకృష్ణ కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ కొనసాగుతున్నాడు.