NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఖుషి ట్రైలర్: మరోసారి గీత గోవిందం మాదిరి పాత్రలో విజయ్ దేవరకొండ 
    తదుపరి వార్తా కథనం
    ఖుషి ట్రైలర్: మరోసారి గీత గోవిందం మాదిరి పాత్రలో విజయ్ దేవరకొండ 

    ఖుషి ట్రైలర్: మరోసారి గీత గోవిందం మాదిరి పాత్రలో విజయ్ దేవరకొండ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 09, 2023
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా కనిపించిన ఖుషి సినిమా ట్రైలర్ ఇప్పుడే రిలీజైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

    ట్రైలర్ మొదట్లో కాశ్మీర్ లో విజయ్ దేవరకొండ, సమంత పాత్రల మధ్య ప్రేమ చిగురించడాన్ని చూపించారు. మొదట ముస్లిం అమ్మాయిగా కనిపించిన సమంత, తాను ముస్లిం కాదని బ్రాహ్మిణ్ అని చెబుతుంది.

    ఆ తర్వాత వారిద్దరికి పెళ్ళి చేయడానికి పెద్దలు నిరాకరించినట్టుగా చూపించారు. కానీ తమ ప్రేమ ఎంతో గొప్పదని, ఆ గొప్పదనాన్ని చూపించాలని ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు.

    పెళ్ళి తర్వాత విజయ్, సమంత పాత్రల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినట్టు, ఆ ఇబ్బందులే పెద్దగా మారినట్టు ట్రైలర్ లో కనిపించింది.

    Details

    సెప్టెంబర్ 1న విడుదల 

    ట్రైలర్ మొత్తంలో పూర్తి సినిమా కనిపించేసిందని చెప్పాలి. సాధారణంగా సమాజంలో కనిపించే ఇష్యూని తీసుకుని సినిమాను తెరకెక్కించినట్టుగా అర్థమవుతోంది.

    విజయ్ దేవరకొండ మరోసారి గీత గోవిందం సినిమా మాదిరి పాత్రలో కనిపించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

    గీత గోవిందం సినిమాలోని విజయ్ దేవరకొండ పాత్రకు చాలామంది అభిమానులు ఉన్నారు కాబట్టి, అది ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

    తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో ఖుషి ట్రైలర్ ను రిలీజ్ చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మిస్తున్నారు.

    హేషమ్ అబ్దుల్ వాహెబ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయ్ దేవరకొండ
    సమంత
    ఖుషి
    ట్రైలర్ టాక్

    తాజా

    Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం .. గూగుల్
    Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం చంద్రబాబు నాయుడు
    350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి  ఉత్తర్‌ప్రదేశ్
    WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు  ఐసీసీ

    విజయ్ దేవరకొండ

    సమంత ఎస్ చెప్పడంతో రెండు సినిమాలను ఒకేసారి తీసుకురానున్న విజయ్ దేవరకొండ తెలుగు సినిమా
    గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ తెలుగు సినిమా
    ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం తెలుగు సినిమా
    ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్  తెలుగు సినిమా

    సమంత

    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు ఓటిటి
    వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100  తెలుగు సినిమా
    సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు తెలుగు సినిమా

    ఖుషి

    ఖుషి సెకండ్ సాంగ్ విడుదల: సమంత, విజయ్ కెమిస్ట్రీ అదుర్స్  విజయ్ దేవరకొండ
    ఖుషి షూటింగ్ పూర్తి; చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ విజయ్ దేవరకొండ
    ఖుషి ట్రైలర్ వచ్చేస్తోంది: నిడివి కూడా చెప్పేసిన రౌడీ స్టార్  విజయ్ దేవరకొండ

    ట్రైలర్ టాక్

    బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ తెలుగు సినిమా
    భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ తెలుగు సినిమా
    దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం తెలుగు సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025