తదుపరి వార్తా కథనం
Vijay Deverakonda: నిషేధిత బెట్టింగ్ యాప్‌ల కేసులో సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 11, 2025
03:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్‌ల నుంచి పొందిన పారితోషికం, కమీషన్ల వివరాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండతో పాటు మరో సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్‌కూ ఇదే కేసులో సిట్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఈ నిషేధిత బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో ఉంది.