Loading...
Epic: తమ్ముడి కోసం విజయ్‌ దేవరకొండ.. 'ఎపిక్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రౌడీ హీరో?
తమ్ముడి కోసం విజయ్‌ దేవరకొండ.. 'ఎపిక్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రౌడీ హీరో?

Epic: తమ్ముడి కోసం విజయ్‌ దేవరకొండ.. 'ఎపిక్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రౌడీ హీరో?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

'బేబీ' సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్‌ అందుకున్న ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యల క్రేజీ కాంబినేషన్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న కొత్త చిత్రం 'ఎపిక్‌' (EPIC). కమింగ్‌ ఆఫ్‌ ఏజ్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్‌ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. '90s - ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌' వెబ్‌ సిరీస్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఆదిత్య హాసన్‌.. 'ఎపిక్‌'తో వెండితెర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

వివరాలు

ముఖ్య అతిథిగా హాజరైన రష్మిక

సెప్టెంబర్‌ 4న హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో 'ఎపిక్‌' గ్రాండ్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో ఆనంద్‌ దేవరకొండ రష్మికను ఆప్యాయంగా 'వదినమ్మ' అని సంబోధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆనంద్‌ వ్యాఖ్యలకు స్పందించిన రష్మిక.. అతడిపై ప్రశంసలు కురిపించింది. ఆనంద్‌ కేవలం గ్రీన్‌ ఫ్లాగ్‌ మాత్రమే కాదని, ఒక పెద్ద 'గ్రీన్‌ ఫారెస్ట్‌' అని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు

తమ్ముడి కోసం విజయ్‌ వస్తారా?

'ఎపిక్‌' విడుదలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది.

ఈ క్రమంలో తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ సినిమాకు అన్నయ్య విజయ్‌ దేవరకొండ కూడా అండగా నిలవనున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

సెప్టెంబర్‌ 8న విజయవాడలో జరగనున్న 'ఎపిక్‌' ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒకవేళ విజయ్‌ ఈ కార్యక్రమానికి హాజరైతే.. 'ఎపిక్‌' ప్రమోషన్స్‌కు భారీ బూస్ట్‌ లభించినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఆనంద్‌ దేవరకొండకు తన మద్దతును ప్రకటించారు.

ADVERTISEMENT

వివరాలు

దీనిపై స్పష్టత రావాల్సి ఉంది

ఇటీవల జరిగిన 'ఎపిక్‌ ఫస్ట్‌ సెమెస్టర్‌' ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె.. సినిమాపై తన సపోర్ట్‌ను చూపించారు.

ఆనంద్‌ను కేవలం కుటుంబ సభ్యుడిగా కాకుండా నటుడిగా కూడా తాను గర్వపడుతున్నాననే విధంగా రష్మిక మాట్లాడటం అభిమానులను ఆకట్టుకుంది.

అంతేకాకుండా 'ఎపిక్‌' ట్రైలర్‌ను కూడా ఆమె ప్రశంసించారు. ఇప్పటికే రష్మిక మద్దతు లభించిన నేపథ్యంలో.. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ కూడా తమ్ముడి సినిమా కోసం ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు వస్తారా? వస్తే ఈ వేడుకలో ఎలాంటి సందడి నెలకొంటుంది? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT