LOADING...
Vijay Deverakonda: 'రష్… నిన్ను చూసి గర్వంగా ఉంది'.. రష్మికపై విజయ్ మాటలు వైరల్!
రష్… నిన్ను చూసి గర్వంగా ఉంది'.. రష్మికపై విజయ్ మాటలు వైరల్!

Vijay Deverakonda: 'రష్… నిన్ను చూసి గర్వంగా ఉంది'.. రష్మికపై విజయ్ మాటలు వైరల్!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విజయోత్సవ వేడుక బుధవారం (నవంబర్ 12)జరిగింది. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విజయ్-రష్మిక జంట ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ నిశ్చితార్థం తర్వాత ఇద్దరూ మొదటిసారిగా ఒకే వేదికపై కనిపించడంతో ఈ వేడుకపై భారీ ఆసక్తి నెలకొంది. వేదికపై విజయ్ ముందుగా సినిమా గురించి మాట్లాడాడు. తరువాత నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రస్తావన చేస్తూ చివరగా రష్మిక గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.

వివరాలు 

ఎవరేమన్నా చేస్తుంది

విజయ్ మాట్లాడుతూ.."రష్మికను నేను గీత గోవిందం సినిమాకాలం నుంచే గమనిస్తున్నాను.ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఆమె పోషించిన పాత్రలా, నిజ జీవితంలోనూ ఆమె అమాయకురాలు,చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకునే మనసు కలిగినది. తన గురించి అంతగా ఆలోచించదు,ఎవరేమన్నా చేస్తుంది.ఆ గీత గోవిందం రోజుల్లోని అమ్మాయి నుంచి,ఇప్పుడు ఒక పరిపక్వ మహిళగా ఎదిగి, ఇలాంటి స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవడం..కెరీర్ పీక్‌లో ఉన్నప్పటికీ ఇలాంటి సినిమా చేయడం.. చాలా మందికి స్ఫూర్తినిచ్చే విషయం. రష్... ఇది నీ కథ చెప్పాల్సిన సమయం. నీ ప్రయాణం చూసి నాకు నిజంగా గర్వంగా ఉంది. నిన్ను గురించి కూడా చాలా మాటలు చెప్పారు. కానీ నువ్వు ఆ మాటలకు సమాధానం ఇవ్వకుండా నీ మంచితనంతోనే అందరికీ చూపించావు.

వివరాలు 

నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు రష్

నన్ను ఎవరేమన్నా అంటే నేను రివర్స్ లో వేస్తా... కానీ నువ్వు మాత్రం ప్రతిదీ ప్రశాంతంగా ఎదుర్కొంటావు. అదే నీ ప్రత్యేకత. ప్రపంచం నిన్ను ఎన్ని మాటలతో విమర్శించినా, ఒక రోజు అదే ప్రపంచం నిన్ను నిజంగా ఎవరో గుర్తిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు రష్... నువ్వు ఒక అద్భుతమైన మహిళవి. మేమంతా నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తాం," అని విజయ్ ప్రేమగా పేర్కొన్నాడు.