Loading...
Ranabaali: విజయ్ దేవరకొండ రణబాలి సినిమాకు నైజాంలో బుకింగ్స్ ఓపెన్ 
విజయ్ దేవరకొండ రణబాలి సినిమాకు నైజాంలో బుకింగ్స్ ఓపెన్

Ranabaali: విజయ్ దేవరకొండ రణబాలి సినిమాకు నైజాంలో బుకింగ్స్ ఓపెన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2026
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రణబాలి'. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అమెరికా మార్కెట్‌లో మంచి బుకింగ్స్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ల అమ్మకాలను ప్రారంభిస్తోంది. తాజాగా నైజాం ప్రాంతంలో 'రణబాలి' సినిమా బుకింగ్స్ మొదలయ్యాయి.

వివరాలు 

నైజాంలోనూ సాధారణ టికెట్ ధరలతోనే అమ్మకాలు

తొలుత డిస్ట్రిక్ట్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి.

మరో విశేషం ఏమిటంటే.. నైజాంలోనూ సాధారణ టికెట్ ధరలతోనే అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

దీంతో ప్రేక్షకుల నుంచి సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందనే ఆసక్తి నెలకొంది.

అమెరికాలో ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే జోరు కొనసాగిస్తుందా అనేది చూడాలి.

ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ llp చేసిన ట్వీట్ 

ADVERTISEMENT