LOADING...
Ajith Kumar: విజయ్‌ ఒక్కరే కాదు.. మనందరం బాధ్యులమే.. కరూర్‌ ఘటనపై అజిత్‌ వ్యాఖ్యలు
విజయ్‌ ఒక్కరే కాదు.. మనందరం బాధ్యులమే.. కరూర్‌ ఘటనపై అజిత్‌ వ్యాఖ్యలు

Ajith Kumar: విజయ్‌ ఒక్కరే కాదు.. మనందరం బాధ్యులమే.. కరూర్‌ ఘటనపై అజిత్‌ వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) తనపై వచ్చిన నెగెటివ్ వార్తలను చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌, అలాగే ఇటీవల తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తొక్కిసలాట ఘటనకు విజయ్ మాత్రమే కాదు, మనందరం బాధ్యులమేనని అజిత్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇందుకు మీడియా కూడా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు సినీతారల సభల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, క్రికెట్ మ్యాచ్‌లకు వేలాదిమంది వస్తారు, థియేటర్లలో మాత్రం గందరగోళం తప్పదు. ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెస్తాయని చెప్పారు.

Details

అభిమానుల పట్ల ప్రేమతో కూడిన ఆందోళన

'నా పిల్లలు నన్ను స్కూల్‌కు తీసుకెళ్లమని కోరుతారు. కానీ ఇప్పటివరకు ఒక్కరోజు కూడా నేను వారిని డ్రాప్ చేయలేదు. ఎందుకంటే, నేను కారు డ్రైవ్ చేస్తూ వెళ్తే, కనీసం 50-60 మంది బైక్‌పై వెంబడిస్తారు. ఫోటోలు తీయాలని ప్రయత్నిస్తారు. అలాంటి సందర్భాల్లో అభిమానులకే కాదు, ఇతరులకూ ప్రమాదం ఏర్పడే అవకాశముంది. ఒకసారి కారులో నుంచి అభిమానులకు ఫోటోలు ఇస్తూ నా చేతికి గాయమైంది కూడా అని ఆయన చెప్పారు.

Details

తన కెరీర్‌పై అజిత్ మాటలు 

'నేను ప్రతి సినిమాను నా తొలి చిత్రం లాగా తీసుకుంటాను. నాకు వచ్చిన బ్లాక్‌బస్టర్ విజయాల గురించి ఆలోచించను. నా మొదటి సినిమాకి నిర్మాతలు 100 రోజుల కాల్‌షీట్ అడిగారు, కానీ నేను ఇప్పటికీ 33 ఏళ్లుగా వారికోసం డేట్స్ ఇస్తూనే ఉన్నాను. నాకు ఇంతకాలం అభిమానుల మద్దతు దొరకడం నా అదృష్టం. నా భార్య షాలినీ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునే వాడిని కాదని అజిత్ తెలిపారు.

Details

 నెగెటివ్ వార్తలపై స్పందన 

2021లో తమిళనాడు ఎన్నికల సమయంలో తనపై వచ్చిన ఓ వార్త గురించి కూడా అజిత్ స్పందించారు. ''ఓటు హక్కు వినియోగించుకునేందుకు షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి సెలబ్రిటీల ఫోటోలు తీస్తూ నియమాలు ఉల్లంఘించాడు. ఫోన్ ఉపయోగించకూడదని బోర్డులు ఉన్నప్పటికీ అతను వినలేదు. అందుకే నేను అతని ఫోన్‌ను సిబ్బందికి ఇచ్చాను. ఆ వీడియో వైరల్ అయ్యింది. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని, నేను అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశానని రాశారు. ఆ వార్తలు చూసి నిజంగా షాకయ్యానని అజిత్ వివరించారు.