Vijay Thalapathy : ఎన్నికల ముందు విజయ్ భార్య విడాకులు.. ఇంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొడుకు!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతికి చెందిన తాజా కుటుంబ ట్రబుల్ ఇప్పుడు మీడియా చర్చలో మిగిలిపోతోంది. సినిమాల్లో దశాబ్దాలుగా విజయ్ సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపును, అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరైన ఆయన, ఇప్పుడు రాజకీయాల్లో అడుగు పెట్టి, సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ రాజకీయ ప్రస్థానంతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. విజయ్ భార్య సంగీత తన భర్తతో విడాకులు కోరుతూ చెంగల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Details
ఓ నటితో ఎఫైర్ ఉన్నట్లు టాక్
పిటిషన్‌లో ఇద్దరు రెండేళ్లుగా వేర్వేగా ఉంటున్నారని, విజయ్ కొంతకాలంగా ఒక నటితో ఎఫైర్ ఉందని తెలిపింది. ఈ కేసు భారతీయ సినీరంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ముందు వ్యక్తిగత విషయాలు బయటకు రావడంతో నెటిజన్స్ విజయ్ ఏ నటితో ఉన్నాడని సెర్చ్‌చేస్తున్నారు. ఇప్పటివరకు విజయ్ ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇక విజయ్ దళపతికి తనయుడు జాసన్ కూడా షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తన తల్లి విడాకులు కోరడంతో జాసన్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేశారని, విజయ్ ఫాలోయింగ్ లిస్టులో కూడా అతడి పేరు లేనట్లు స్క్రీన్‌షాట్లను నెటిజన్స్ షేర్ చేస్తున్నారు.
Details
దర్శకుడిగా సినీరంగంలోకి అడుగు
అయితే జాసన్ నిజంగా తన తండ్రిని అన్ ఫాలో చేశాడో లేదో స్పష్టంగా తెలియదు. జాసన్ తండ్రి దారిలో హీరోగా కాకుండా దర్శకుడిగా సినీరంగంలో అడుగుపెడుతున్నాడని సమాచారం. ఇప్పటికే సందీప్ కిషన్ హీరోగా తన తొలి ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో, విజయ్ రాజకీయ, వ్యక్తిగత పరంగా రెండు వేర్వేరు ఫ్రంట్‌లలో నడుస్తున్నారని స్పష్టమవుతోంది.