
Surya Sethupathi: విజయ్ సేతుపతి కొడుకు మూవీకి డిజాస్టర్ ఓపెనింగ్.. అయినా ప్రశంసలు!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి ఇప్పుడు హీరోగా పరిచయమయ్యాడు. జూలై 4, 2025న విడుదలైన 'ఫీనిక్స్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ ద్వారా అతను తెరంగేట్రం చేశాడు. బాలనటుడిగా తండ్రితో కలిసి 'నానుమ్ రౌడీ తాన్', 'సింధుపథ్' వంటి చిత్రాల్లో కనిపించిన సూర్య.. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ప్రముఖ స్టంట్ మాస్టర్ 'అనల్ అరసు' దర్శకత్వం వహించారు. దేవదర్శిని, వరలక్ష్మి శరత్‌కుమార్ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
Details
యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్న సూర్య సేతుపతి
సంగీత దర్శకుడు సామ్ సిఎస్ చిత్రానికి సంగీతం అందించారు. యాక్షన్ సన్నివేశాల్లో రియలిస్టిక్ ఫీలొస్తుందనే లక్ష్యంతో సూర్య ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఫైటింగ్ సీన్లలో అతను చూపిన డెడికేషన్‌ను కొందరు అభినందించారు కూడా. విజయ్ సేతుపతి తన కుమారుడి సినిమాకు ప్రమోషన్ చేసినప్పటికీ, 'ఫీనిక్స్'కు అనుకున్నంత హైప్ రాలేదు. ప్రమోషన్ ఈవెంట్లలో సూర్య ప్రవర్తనపై కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది నెటిజన్లు అతని అహంకార ధోరణిని ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఈ నెగెటివ్ ప్రచారం ఓపెనింగ్‌కు బలపడిందో లేక ఇతర సినిమాల పోటీయో తెలీదు కానీ, 'ఫీనిక్స్' బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించింది.
Details
తన
విడుదలైన రోజే అదే తేదీన సిద్ధార్థ్-శరత్‌కుమార్ నటించిన 3BHK, రామ్ నటించిన పరాంతు బో సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు మంచి ఓపెనింగ్స్ సాధించగా, ఫీనిక్స్ మాత్రం కేవలం రూ. 10 లక్షల వసూళ్లతో సరిపెట్టుకుంది. ఇదే సమయంలో పరాంతు బో రూ. 42 లక్షలు వసూలు చేయగా, 3BHK ఒక్కరోజులోనే రూ. 1 కోటి మార్కును దాటింది. ఈ స్పష్టమైన డిజాస్టర్ ఓపెనింగ్ ఫీనిక్స్ బృందానికి పెద్ద సవాలుగా మారింది. అయితే సినిమా టీమ్ మాత్రం వారాంతంలో కలెక్షన్లు మెరుగవుతాయనే ఆశపై ఉంది.