LOADING...
Jana Nayagan: ఎట్టకేలకు థియేటర్స్ కి వస్తున్న 'జన నాయగన్'.. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధం అవుతున్న మూవీ
ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధం అవుతున్న మూవీ

Jana Nayagan: ఎట్టకేలకు థియేటర్స్ కి వస్తున్న 'జన నాయగన్'.. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధం అవుతున్న మూవీ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ ప్రముఖ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'జన నాయకన్' చిత్రం గత కొంతకాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ వాయిదా పడుతూ వచ్చింది. నిర్మాణ పనులు పూర్తయినా, విడుదలకు సంబంధించి ఏర్పడిన సాంకేతిక ఆటంకాలు అభిమానుల్లో నిరాశను కలిగించాయి. ముఖ్యంగా, ఈ సినిమా క్లిప్‌లు నెట్టింట లీక్ అవ్వడం, ఒక లోకల్ ఛానల్ లో ప్రసారం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పైరసీ కోరల్లో చిక్కుకున్న ఈ సినిమా థియేటర్ల వరకు వస్తుందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఈ చిత్రంపై సానుకూల పరిణామం చోటుచేసుకుంది. అన్ని అడ్డంకులను అధిగమించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు చర్యలు ప్రారంభించారు.

వివరాలు 

ఆదాయ పరంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో..

సెన్సార్ బోర్డు ఈ సినిమాను వీక్షించి 'యూ/ఏ' సెర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీనితో చట్టపరంగా, సాంకేతికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, 'జన నాయకన్' చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. గత కొన్ని నెలలుగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న విజయ్ అభిమానులు ఈ వార్తతో ఆనందంలో మునిగిపోయారు. పైరసీ సమస్యలు ఉన్నప్పటికీ, తమ అభిమాన నటుడిని వెండితెరపై చూడడమే అసలైన అనుభూతి అని సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులో ఈ చిత్రం ఆదాయ పరంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Advertisement