Loading...
Nani: అసెంబ్లీలో విజయ్‌ జోరు అదిరింది.. నాని ఏమన్నారంటే?
అసెంబ్లీలో విజయ్‌ జోరు అదిరింది.. నాని ఏమన్నారంటే?

Nani: అసెంబ్లీలో విజయ్‌ జోరు అదిరింది.. నాని ఏమన్నారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ హీరో నాని (Nani).. తమిళనాడు సీఎం విజయ్‌ (Vijay) రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా చిత్రం 'ది ప్యారడైజ్‌' (The Paradise) ప్రచారంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజల్లో విజయ్‌కు ఉన్న క్రేజ్‌, ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం గురించి ప్రస్తావించారు. ''ఇది కేవలం ఆయన స్టార్‌డమ్‌ లేదా బాక్సాఫీస్‌ విజయం కాదు. తమిళనాడు ప్రజలు విజయ్‌పై ఎన్నో ఏళ్లుగా నమ్మకాన్ని పెంచుకున్నారు. ఆయనను తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. ఇది ఆయనపై వారికి ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది. నేను ఆయన వీడియోలు సోషల్‌ మీడియాలో చూశాను. అసెంబ్లీలో ఆయన అదరగొడుతున్నారు. ఆ వీడియోలు అద్భుతంగా అనిపిస్తున్నాయి.

వివరాలు

'పాన్‌ ఇండియా' ట్యాగ్‌ నచ్చదు..

రాబోయే ఏళ్లలోనూ ఆయన పాలన ఇలానే ఉండాలని, తమిళనాడు ప్రజల ఎంపిక సరైనదేనని రుజువు కావాలని కోరుకుంటున్నాను'' అని నాని అన్నారు.

విజయ్‌ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు కూడా నాని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ప్రెస్‌మీట్‌లో తనను 'పాన్‌ ఇండియా స్టార్‌' అని పిలవడం నచ్చదని నాని తెలిపారు.

సినిమాలకు 'పాన్‌ ఇండియా' అనే లేబుల్‌ వేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

''ఒక బాలీవుడ్‌ సినిమా మంచి విజయం సాధించినప్పుడు, దాన్ని అందరూ సాధారణంగా 'హిందీ సినిమా' అని మాత్రమే పిలుస్తారు.

కానీ ఒక సౌత్‌ సినిమా విజయం సాధిస్తే మాత్రం దాన్ని 'పాన్‌ ఇండియా సినిమా' అని లేబుల్‌ వేస్తారు.

వివరాలు

సెప్టెంబర్‌ 24న 'ది ప్యారడైజ్‌'

అది నాకు నచ్చదు. అందుకే నా సినిమాలను పాన్‌ ఇండియా సినిమాలు అని పిలవడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు'' అని నాని పేర్కొన్నారు.

గతంలోనూ 'ది ప్యారడైజ్‌' విషయంలో పాన్‌ ఇండియా అనే ట్యాగ్‌ను ఉపయోగించకూడదని తన అభిప్రాయాన్ని నాని వెల్లడించారు.

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్‌'పై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదలకు ముందు చిత్రబృందం ప్రమోషన్స్‌లో భాగంగా పలు మీడియా సమావేశాలు నిర్వహిస్తోంది.

ADVERTISEMENT