
War 2: విజయవాడ వేదికగా వార్ 2 ఈవెంట్..? క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మెగా యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్ 2' (War 2) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో, ప్రీరిలీజ్ ఈవెంట్‌పై భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఈవెంట్ విజయవాడలో జరగనుందని, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఈ వేడుకకు హాజరవుతారన్న ప్రచారం వేగంగా విస్తరించింది. తాజాగా ఈ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ఈవెంట్ గురించి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని, వేడుకకు వేదికను ఇంకా ఖరారు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన
ప్రీరిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాతే అధికారిక ప్రకటన చేస్తామని స్పష్టం చేసింది. దీంతో విజయవాడ వేదికపై వస్తున్న ఊహాగానాలకు కొంతవరకూ చెక్ పడినట్లయింది. గతంలో ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో రద్దవడంతో కొంత గందరగోళం చోటుచేసుకుంది. దీంతో 'వార్ 2' వేడుకను ఎంతో జాగ్రత్తగా, ప్లాన్ చేసి నిర్వహించాలన్నదే చిత్రబృందం లక్ష్యం కావచ్చని అంటున్నారు సినీ వర్గాలు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోంది. కియారా అడ్వాణీ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది.