Page Loader
Vikrant Massey: విక్రాంత్ మాస్సే షాకింగ్ నిర్ణయం.. నటనకు గుడ్ బై
విక్రాంత్ మాస్సే షాకింగ్ నిర్ణయం.. నటనకు గుడ్ బై

Vikrant Massey: విక్రాంత్ మాస్సే షాకింగ్ నిర్ణయం.. నటనకు గుడ్ బై

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు విక్రాంత్ మాస్సే తన నటనకు గుడ్ బై చెప్పి సినీ ప్రపంచం, అభిమానులు షాక్‌కు గురయ్యారు. 'ట్వెల్త్ ఫెయిల్' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన విక్రాంత్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని పంచుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అందరి నుంచి అపారమైన ప్రేమను పొందానని, మీ అభిమానానికి తన జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పారు. ప్రస్తుతం తన కుటుంబానికి పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన సమయం వచ్చిందన్నారు. అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదన్నారు. 2025లో విడుదలకానున్న తన చివరి సినిమా తర్వాత ఇక రిటైర్ అవుతానని పేర్కొన్నారు.

Details

విక్రాంత్ నిర్ణయంపై నెటిజన్ల ప్రశ్నల వర్షం

మీ అందరి ప్రేమతో ఎన్నో అందమైన జ్ఞాపకాలను పొందానని, అందరికీ కృతజ్ఞతలని అని విక్రాంత్ తన నోట్‌లో రాసుకొచ్చారు. ఈ ప్రకటన అభిమానులను ఆలోచనలో పడేసింది. విక్రాంత్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు? అంటూ కామెంట్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు. సీరియల్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన విక్రాంత్, 'బాలికా వధు' (తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు') ద్వారా గుర్తింపు పొందారు. గతంలో ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన విక్రాంత్, ఇటీవల గోవాలో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఇఫీ)లో 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నారు.