NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / విమానం రివ్యూ: కొడుకు కోరికను తీర్చాలనుకునే తండ్రి కథ ఎలా ఉందంటే? 
    తదుపరి వార్తా కథనం
    విమానం రివ్యూ: కొడుకు కోరికను తీర్చాలనుకునే తండ్రి కథ ఎలా ఉందంటే? 
    విమానం రివ్యూ

    విమానం రివ్యూ: కొడుకు కోరికను తీర్చాలనుకునే తండ్రి కథ ఎలా ఉందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 09, 2023
    10:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన విమానం, ఈరోజు థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ, అనసూయ, ధన్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.

    కథ:

    దివ్యాంగుడైన వీరయ్య(సముద్రఖని) తన కొడుకు రాజును(మాస్టర్ ధృవన్) ప్రేమగా చూసుకుంటాడు. రాజుకు చిన్నప్పటి నుండి విమానం ఎక్కాలన్న కోరిక ఉంటుంది.

    సులభ్ కాంప్లెక్స్ నడుపుకునే వీరయ్య దగ్గర అంత డబ్బు ఉండదు. అయితే అనుకోకుండా రాజును విమానం ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. దానికోసం డబ్బులు ఎలా తీసుకురావాలో వీరయ్యకు అర్థం కాదు.

    అదే బస్తీలో ఉండే వేశ్య సుమతి(అనసూయ), కోటి(రాహుల్ రామకృష్ణ), డేనియల్(ధన్ రాజ్) జీవితాల కథ ఏంటి? వీరందరూ వీరయ్యకు ఎలా సాయం చేసారన్నదే కథ.

    Details

    విమానం సినిమా ప్లస్సులు, మైనస్సులు 

    తండ్రీ కొడుకుల మధ్య బంధం ఆకట్టుకునే విధంగా ఉంది. తండ్రిగా సముద్రఖని నటన బాగుంది. కొడుక్కి వచ్చిన సమస్యను దూరం చేయడానికి తండ్రి పడే తపన ఇందులో కనిపిస్తుంది.

    విమానం సినిమాలో మాటలు హైలైట్ గా నిలుస్తాయి. నాన్న గురించి, పేదరికం గురించి వినిపించే డైలాగులు కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాయి. సుమతి పాత్రలో అనసూయ చెప్పిన డైలాగులు బాగున్నాయి.

    చరణ్ అర్జున్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు సినిమాను మరోమెట్టు ఎక్కించాయి. సుమతి, కోటి, ధన్ రాజ్ పాత్రల నిడివి ఇంకా ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనిపించింది.

    కథనం నెమ్మదిగా సాగుతుండడం ప్రేక్షకుడిని కొంత ఇబ్బంది పెడుతుంది. కాకపోతే పతాక సన్నివేశాలకు చేరుకునే వరకు ఆ ఇబ్బంది ఎక్కడా కనిపించదు.

    Details

    అతిధి పాత్రలో మీరా జాస్మిన్ 

    విమానం సినిమాలో నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. కథంతా ప్రధాన పాత్రలైన వీరయ్య, రాజు చుట్టూ తిరుగుతుంది కాబట్టి సముద్రఖని, మాస్టర్ ధృవన్ లు ఆ పాత్రాల్లో ఒదిగిపోయారు.

    దర్శకుడు శివ ప్రసాద్ యానాల్ సింపుల్ కథను రాసుకున్నాడు. దాన్ని తెరకెక్కించడంలో కొత్తదనం కనిపించకపోయినా ఎమోషన్ సీన్లు బలంగా ఉన్నాయి.

    హీరోయిన్ మీరా జాస్మిన్ అతిధి పాత్రలో కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే విమానం సినిమా ఒక ఎమోషనల్ రైడ్. తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని చాలా బాగా చూపిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మూవీ రివ్యూ
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    మూవీ రివ్యూ

    ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా
    మూవీ రివ్యూ: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్
    దసరా ట్విట్టర్ రివ్యూ: బద్దల్ బాశింగాల్ అయినట్టేనా దసరా మూవీ
    రావణాసుర రివ్యూ: రవితేజ థ్రిల్ చేసాడా? రవితేజ

    తెలుగు సినిమా

    గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు: కార్తికేయ 2 దర్శకుడితో 300కోట్ల సినిమా  సినిమా
    రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబో సినిమా మొదలు?  సినిమా
    పొన్నియన్ సెల్వన్ 2: డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆ నిబంధన తొలగింపు  ఓటిటి
    నాగచైతన్య నెక్స్ట్: బోటు డ్రైవర్ గా రూటు మారుస్తున్నాడు  నాగ చైతన్య

    సినిమా రిలీజ్

    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్
    షార్ట్ ఫిలిమ్ టు సిల్వర్ స్క్రీన్: కిరణ అబ్బవరం పరిచయం చేసిన కొత్త హీరో తెలుగు సినిమా
    నిర్మాతగా 20ఏళ్ళు పూర్తి: కేజీఎఫ్ హీరో యష్ తో సినిమా ఉంటుందంటున్న దిల్ రాజు తెలుగు సినిమా
    #Suriya42: సూర్య సినిమాకు ప్రచారంలో ఉన్న క్రేజీ టైటిల్ సినిమా

    సినిమా

    స్పైడర్ మ్యాన్ సినిమాకు వాయిస్ ఇస్తున్న భారత క్రికెటర్ శుభ్ మన్ గిల్  సినిమా
    'ఉస్తాద్ భగత్ సింగ్' క్రేజీ అప్డేట్; రేపు మొదటి గ్లింప్స్ విడుదల పవన్ కళ్యాణ్
    ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే  ప్రభాస్
    ఉస్తాద్ భగత్ సింగ్: గ్లింప్స్ కన్నా ముందు అదిరిపోయే పోస్టర్ రిలీజ్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025