LOADING...
Viral bread dress: బ్రెడ్‌తో చేసిన డ్రెస్‌పై దుమారం.. ఫ్యాషనా? ఆహార వృథానా?
బ్రెడ్‌తో చేసిన డ్రెస్‌పై దుమారం.. ఫ్యాషనా? ఆహార వృథానా?

Viral bread dress: బ్రెడ్‌తో చేసిన డ్రెస్‌పై దుమారం.. ఫ్యాషనా? ఆహార వృథానా?

వ్రాసిన వారు Sirish Praharaju
May 11, 2026
07:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికన్ మ్యాజిక్ వ్యూవర్స్ ఛాయిస్ అవార్డ్స్ (AMVCA) 2026 వేడుకల్లో ఓ ప్రత్యేక డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రియాలిటీ టీవీ స్టార్ క్వీన్ మర్సీ అటాంగ్.. 500కుపైగా బ్రెడ్ లోఫ్స్‌తో తయారుచేసిన డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ డిజైనర్ టోయిన్ లావానీ రూపొందించిన ఈ డ్రెస్‌ను అటాంగ్ తన బేకరీ బిజినెస్ ప్రమోషన్ కోసం ఉపయోగించినట్లు తెలిపింది. "నా వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవడానికి AMVCA కంటే మంచి వేదిక ఇంకేదుంటుంది?" అంటూ ఆమె బీబీసీకి చెప్పింది. అయితే ఈ డ్రెస్‌పై సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. కొందరు ఆమె క్రియేటివిటీని మెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం ఇది ఆహార వృథా అంటూ మండిపడ్డారు.

వివరాలు 

ఫ్యాషన్ పేరుతో అన్నీ సమర్థించలేం..

ముఖ్యంగా నైజీరియాలో పేదరికం, ఆకలి సమస్యలు ఉన్న సమయంలో ఇలా తినే బ్రెడ్‌తో డ్రెస్ తయారు చేయడం సరికాదని విమర్శించారు. "ఫ్యాషన్ పేరుతో అన్నీ సమర్థించలేం" అంటూ పలువురు కామెంట్లు చేశారు. ఇంకొందరు అయితే AMVCA నిర్వాహకులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. మే 9న నైజీరియాలో జరిగిన 12వ AMVCA అవార్డ్స్‌లో ఆఫ్రికన్ సినిమా, టెలివిజన్ రంగాలకు చెందిన 32 విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. 'మై ఫాదర్స్ షాడో' ఉత్తమ చిత్రంగా నిలవగా.. లిండా ఎజియోఫర్-సులేమాన్ ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి అవార్డులు గెలిచి రికార్డు సృష్టించింది.

Advertisement