LOADING...
Virat Kohli: విరాట్ కోహ్లీ వంద శతకాలు చేసే సత్తా ఉంది : సునీల్ గవాస్కర్
విరాట్ కోహ్లీ వంద శతకాలు చేసే సత్తా ఉంది : సునీల్ గవాస్కర్

Virat Kohli: విరాట్ కోహ్లీ వంద శతకాలు చేసే సత్తా ఉంది : సునీల్ గవాస్కర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాల మార్కు చేరుకునే సామర్థ్యం పూర్తిగా ఉందని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) భావిస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్‌కప్ తర్వాత కూడా కోహ్లీ తన కెరీర్‌ను కొనసాగించగలడని, ఆ స్థిరత్వం, ఫిట్‌నెస్ అతడిలో ఉన్నాయని గావస్కర్ అభిప్రాయపడ్డాడు విశాఖపట్నంలో సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ (65*; 45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరోసారి జోరుమీద మ్యాచ్‌ను ముగించాడు. అందుకు ముందున్న రెండు వన్డేల్లో శతకాలు బాదిన కోహ్లీ మొత్తం సిరీస్‌లో 302 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.

Details

ప్రస్తుతం 84 శతకాలు చేసిన కోహ్లీ

మ్యాచ్ ముగిసిన అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గావస్కర్, కోహ్లీ ప్రస్తుత ఫామ్, భవిష్యత్తు శతకాలపై విశ్లేషణ ఇచ్చాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు చేసిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 84 సెంచరీలున్నాయి. గావస్కర్ ఏమన్నాడంటే ఎందుకు సాధ్యం కాదు? కోహ్లీ ఇంకా కనీసం మూడు సంవత్సరాలు ఆడితే 100 శతకాల మార్క్ చేరడంలో ఎలాంటి సందేహం లేదు. సౌతాఫ్రికా సిరీస్‌లో అతను రెండు సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్‌తో రాబోయే సిరీస్‌లో మరో రెండు శతకాలు చేస్తే మొత్తం 86కు చేరతాయి. 2027 వరల్డ్‌కప్ వరకూ భారత్ దాదాపు 35 వన్డేలు ఆడే అవకాశముంది.

Details

 జనవరి 11 నుండి వన్డే సిరీస్ ప్రారంభం 

ఈ మ్యాచ్‌లన్నింటిలో కోహ్లీ పాల్గొని ఇదే ఫామ్ కొనసాగిస్తే 100 సెంచరీలు చేయడం పూర్తిగా సాధ్యమే అని చెప్పారు. ప్రస్తుతం కోహ్లీ తన బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నాడు. వన్డేల్లో అతను టీ20 శైలిలో ఇంత అద్భుతంగా ఆడటం చాలా అరుదు. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందుగా నెల రోజుల విరామం దొరికింది. ఆ విరామం అతని ఫామ్‌పై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి. బ్రేక్ లేకపోయి ఉంటే, కివీస్‌పై రెండు లేదా మూడు సెంచరీలు ఖచ్చితంగా వచ్చేవని నా నమ్మకమని గావస్కర్ చెప్పాడు. ఇక భారత్-న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.

Advertisement