LOADING...
Virender Sehwag: 'టాలీవుడ్ హీరోలకు నేను పెద్ద ఫ్యాన్'.. టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమంలో సెహ్వాగ్ 
టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమంలో సెహ్వాగ్

Virender Sehwag: 'టాలీవుడ్ హీరోలకు నేను పెద్ద ఫ్యాన్'.. టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమంలో సెహ్వాగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాకు దూకుడైన ఆరంభాలతో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇప్పుడు క్రికెట్ మైదానాలకంటే సినిమా థియేటర్లలోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన టాలీవుడ్ ప్రో లీగ్ ఈవెంట్‌లో పాల్గొన్న సెహ్వాగ్, తన రిటైర్మెంట్ తర్వాతి జీవితం గురించి సరదాగా స్పందించారు. క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పిన తర్వాత జీవితం చాలా ప్రశాంతంగా మారిందని ఆయన వెల్లడించారు. "ఇప్పుడు ఎలాంటి తొందర లేదు. కావాల్సినంత సమయం ఉంది. ఆ సమయంలో నేను ఎక్కువగా చేసేది ఒక్కటే... టాలీవుడ్ సినిమాలు చూడటం" అంటూ తన వ్యాఖ్యలతో అక్కడున్న వారిని నవ్వించారు. తెలుగు సినిమాలపై తనకున్న ఆసక్తిని సెహ్వాగ్ ఓపెన్‌గా తెలిపారు.

వివరాలు 

మహేశ్ బాబు అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమన్న వీరూ 

ముఖ్యంగా మహేష్ బాబు అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. అలాగే ప్రభాస్ నటించిన'బాహుబలి'చిత్రాన్ని తాను రెండుసార్లు చూసినట్టు గుర్తు చేసుకున్నారు. తెలుగు భాష పూర్తిగా అర్థం కాకపోయినా,హిందీ డబ్బింగ్‌లో అయినా సరే తెలుగు సినిమాలు చూడటం మాననని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'సినిమా తనపై గట్టి ప్రభావం చూపిందని సెహ్వాగ్ అన్నారు. ఆ సినిమాలోని"తగ్గేదేలే"డైలాగ్‌తో పాటు అల్లు అర్జున్ స్టైల్ ఇప్పటికీ తన మనసులో నిలిచిపోయాయని చెప్పారు. ఈ టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమంలో సెహ్వాగ్‌తో పాటు క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సురేశ్ రైనా కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు టోర్నమెంట్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ 

Advertisement