ఓటీటీలో విరూపాక్ష సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్, రికార్డు స్థాయిలో వ్యూస్
ఈ వార్తాకథనం ఏంటి
థియేటర్లలో దుమ్ము దులిపిన విరూపాక్ష, ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయింది. సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా ఈ సంవత్సరం రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లో 100కోట్లు సాధించిన నాలుగవ చిత్రంగా నిలిచింది విరూపాక్ష.
అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ కు విరూపాక్ష సినిమాతో సాలిడ్ హిట్ దక్కింది. నెట్ ఫ్లిక్ లో అందుబాటులో ఉన్న విరూపాక్ష సినిమాను, థియేటర్లలో మిస్ అయిన వారందరూ ఎగబడి చూస్తున్నారు.
రిలీజ్ అయిన మొదటి రోజే రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టుకుంది విరూపాక్ష.
Details
సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన కథ
ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి విరూపాక్ష సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
విరూపాక్ష సినిమాను ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించగా, కార్తీక్ దండు దర్శకత్వం వహించారు.
విరూపాక్ష కథ:
రుద్రవనం అనే ఊరిలో వరసగా మరణాలు సంభవిస్తుంటాయి. కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. దాని వెనుక ఏదో రహస్యం ఉందని ఆ రహస్యాన్ని కనిపెట్టాలని రుద్రవనం ఊరికి వస్తాడు సాయిధరమ్ తేజ్.
అక్కడే అతనికి సంయుక్తా మీనన్ పరిచయమవుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. మరి మరణ రహస్యాలను సాయిధరమ్ తేజ్ కనిపెడతాడా? ఆ రహస్యాలకు సంయుక్తా మీనన్ పాత్రకు సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.