Page Loader
Vishnu Vishal-Jwala Gutta: తల్లిదండ్రులైన విష్ణువిశాల్‌- గుత్తా జ్వాల
తల్లిదండ్రులైన విష్ణువిశాల్‌- గుత్తా జ్వాల

Vishnu Vishal-Jwala Gutta: తల్లిదండ్రులైన విష్ణువిశాల్‌- గుత్తా జ్వాల

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని వీరు ఎక్స్‌వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ''మా ఇంటికి చిన్నారి వచ్చింది. మా కుమారుడు ఆర్యన్‌ ఇప్పుడు పెద్ద అన్నయ్య అయ్యాడు. ఇవాళ మాకు నాలుగో పెళ్లి రోజు. ఇదే రోజు పాప పుట్టడం అంతకంతకూ ఆనందాన్ని ఇచ్చింది. దేవుడిచ్చిన విలువైన వరంగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం అవసరం'' అంటూ ఫొటోతో పాటు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వివరాలు 

క్రికెట్‌ను వదిలి సినిమా రంగంలోకి విష్ణు విశాల్

విష్ణు విశాల్ 2009లో క్రికెట్‌ను వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన 'ఎఫ్‌ఐఆర్‌' సినిమాతో చేరువయ్యారు. గతేడాది వచ్చిన 'లాల్‌ సలాం' చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు, భారత మాజీ బ్యాడ్మింటన్‌ స్టార్‌ అయిన గుత్తా జ్వాల నితిన్ హీరోగా నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో కనిపించారు. విష్ణు విశాల్, గుత్తా జ్వాల 2021 ఏప్రిల్ 22న వివాహబంధంలోకి ప్రవేశించారు. ఇప్పుడా తేదీకే నాలుగేళ్ల తర్వాత పాప పుట్టడం ఎంతో ప్రత్యేకంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తల్లిదండ్రులైన విష్ణువిశాల్‌- గుత్తా జ్వాల