LOADING...
Vishwambhara Two Parts : రెండు పార్ట్స్‌గా 'విశ్వంభర'.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
రెండు పార్ట్స్‌గా 'విశ్వంభర'.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vishwambhara Two Parts : రెండు పార్ట్స్‌గా 'విశ్వంభర'.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 11, 2026
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వరుస వాయిదాల కారణంగా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ వర్గాల్లో 'విశ్వంభర'ను రెండు భాగాలుగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తున్న నేపథ్యంలో అదే తరహాలో ఈ చిత్రాన్ని కూడా రెండు పార్ట్స్‌గా విడుదల చేసే ఆలోచన జరుగుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

వివరాలు

VFX, గ్రాఫిక్స్ పనుల కారణంగా విడుదల ఆలస్యం

అయితే ఈ ప్రచారంపై దర్శకుడు వశిష్ట స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. "రెండు పార్ట్స్‌గా వస్తున్న విశ్వంభర" అనే ట్వీట్‌కు స్పందించిన ఆయన.. "అవునా.. నిజమా?" అంటూ కాస్త వెటకారంగా సమాధానం ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చే ఆలోచన లేదని, సింగిల్ పార్ట్‌గానే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టమైంది. ఇక సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, భారీ స్థాయిలో జరుగుతున్న VFX, గ్రాఫిక్స్ పనుల కారణంగా విడుదల ఆలస్యమవుతోంది.

వివరాలు

సంగీతాన్ని సమకూర్చుకున్న ఎం.ఎం.కీరవాణి

ఈ సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్‌పైనే ఆధారపడి ఉండటంతో, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం హను-మ్యాన్ ఫేమ్ గౌర హరిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే 'విశ్వంభర' ప్రేక్షకులకు సరికొత్త విజువల్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement