Legacy Movie: వారసత్వ రాజకీయాల నడుమ విశ్వక్ సేన్.. 'లెగసీ' టీజర్‌తో పెరిగిన పొలిటికల్ హీట్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో యంగ్ అండ్ డైనమిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'లెగసీ'. ప్యూర్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. 'Politics is Personal' అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ టీజర్ సోషల్ మీడియాలో భారీ స్పందనను రాబడుతోంది. ప్రారంభం నుంచి ముగింపు వరకూ టీజర్ అంతా తీవ్రతతో నడుస్తూ, రాజకీయ నేపథ్యంలోని ఉద్రిక్తతను స్పష్టంగా ఆవిష్కరిస్తోంది.
Details
దర్శకత్వం వహిస్తున్న సాయికిరణ్ రెడ్డి దైడా
టీజర్‌లో విశ్వక్ సేన్ పలికిన డైలాగులు రాజకీయ హీట్‌ను మరింత పెంచుతున్నాయి. రాజకీయమంటే పులిమీద సవారీ లాంటిదంటారు.. ఆ పులి మీద నాయకుడు ఒక్కడే కూర్చోవాలా? ఆ కుటుంబం మొత్తం కూర్చోవాలా?" అనే డైలాగ్స్ ద్వారా అధికారం కోసం ఒకే కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరు, వారసత్వ రాజకీయాల చుట్టూ కథ తిరుగుతుందని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా విశ్వక్ సేన్ ఈ చిత్రంలో ఒక సీరియస్ పొలిటిషియన్ పాత్రలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమాకు సాయికిరణ్ రెడ్డి దైడా దర్శకత్వం వహిస్తున్నారు.
Details
విశ్వక్ సేన్ కెరీర్‌లో మరో కొత్త ప్రయత్నం
భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రావు రమేశ్, సచిన్ ఖేడ్కర్, మురళీ మోహన్, కేకే మేనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కలాహి మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమటి, సాయికిరణ్ రెడ్డి దైడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి 'లెగసీ' టీజర్‌తోనే రాజకీయ డ్రామాగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ, విశ్వక్ సేన్ కెరీర్‌లో మరో బోల్డ్ అండ్ డిఫరెంట్ ప్రయత్నంగా నిలుస్తోంది.