LOADING...
Funky OTT: విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్..
విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్..

Funky OTT: విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మాస్ కా దాస్‌గా పేరొందిన విశ్వక్ సేన్ ఈసారి తనకు సర్వసాధారణమైన జానర్‌కు భిన్నంగా పూర్తిగా ఫన్ జోన్‌లోకి అడుగుపెట్టి చేసిన సినిమా "ఫంకీ". జాతిరత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ ఈ సినిమాను తెరకెక్కించగా, ఇందులో కాయదు లోహార్ హీరోయిన్‌గా నటించింది. నిర్మాత నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుదీప్ స్టైల్‌కు ప్రత్యేకమైన సెటైరికల్ కామెడీతో వచ్చిన ఈ సినిమాకు మాత్రం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు.

వివరాలు 

కామెడీ పంచ్‌లు ఉన్నా ప్రేక్షకుల నిరాశ

సినిమాలో కొన్ని చోట్ల అనుదీప్ ట్రేడ్‌మార్క్ కామెడీ పంచ్‌లు బాగా పేలినా, మొత్తం కథనంలో మాత్రం ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అందుకే సినిమా చూసిన ఆడియన్స్ కొంతవరకు నిరాశ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదే ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లపై కూడా పడింది. కలెక్షన్లలో నిరాశ మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్స్ నుంచే మందగించిన వసూళ్లతో మొదలైంది. చివరికి ఈ సినిమా మొత్తం దాదాపు రూ.7 కోట్ల షేర్ కలెక్షన్లు మాత్రమే సాధించినట్లు సమాచారం. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని చెప్పాలి.

వివరాలు 

ఓటీటీ రిలీజ్‌పై వైరల్ అవుతున్న వార్తలు

ఇప్పుడు "ఫంకీ" ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలి. అందువల్ల మార్చి 12 లేదా 13 తేదీల్లో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. థియేటర్లలో ఆశించిన స్పందన రాకపోయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

విశ్వక్ సేన్ తదుపరి సినిమా

ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికి వస్తే, "ఫంకీ" తర్వాత ఆయన నటిస్తున్న సినిమా "ENE 2 (ఈ నగరానికి ఏమైంది 2)". గతంలో భారీ విజయాన్ని అందుకున్న "ఈ నగరానికి ఏమైంది" చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Advertisement