LOADING...
Vishwambhara Update: 'విశ్వంభర' వీఎఫ్‌ఎక్స్ కారణంగానే జాప్యం..విడుదల తేదీపై చిరంజీవి అప్‌డేట్‌ 
'విశ్వంభర' వీఎఫ్‌ఎక్స్ కారణంగానే జాప్యం..విడుదల తేదీపై చిరంజీవి అప్‌డేట్‌

Vishwambhara Update: 'విశ్వంభర' వీఎఫ్‌ఎక్స్ కారణంగానే జాప్యం..విడుదల తేదీపై చిరంజీవి అప్‌డేట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో, వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ను స్వయంగా చిరంజీవి ప్రకటించారు. అంతేకాక, ఆలస్యానికి గల అసలు కారణాన్ని వివరించే ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు.

వీఎఫ్‌ఎక్స్

 అందుకే కొంత సమయం.. 

"విశ్వంభర ఎందుకు ఆలస్యమవుతుందో అనేకమందికి సందేహం కలుగుతోంది. కానీ ఆ జాప్యం పూర్తిగా న్యాయసమ్మతమని నేను నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని రెండో భాగం (సెకండ్‌ హాఫ్‌) మొత్తం వీఎఫ్‌ఎక్స్ పనిపై ఆధారపడి ఉంటుంది. దాన్ని అత్యుత్తమంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం. చిన్న తప్పు కూడా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే కొంత సమయం తీసుకుంటున్నాం" అని చెప్పారు.

వివరాలు 

ఆగస్టు 21న 'MEGA BLAST Announcement'

"ఈ సినిమా ఒక చందమామ కథలా అందరినీ ఆకట్టుకునేలా సాగుతుంది.వయస్సు తేడా లేకుండా చిన్నాపెద్ద అందరినీ అలరించేలా ఉంటుందని నాకు విశ్వాసం ఉంది.ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను ఆగస్టు 21న సాయంత్రం 6.06 గంటలకు 'MEGA BLAST Announcement'గా విడుదల చేస్తున్నాం.ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆస్వాదించేలా రూపొందిస్తున్నాం.రాబోయే 2026 వేసవిలో ఈ సినిమా థియేటర్లలో మీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఎంజాయ్‌ చేయండి" అని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిరంజీవి చేసిన ట్వీట్