
Vishwambhara: మెగాస్టార్ బర్త్‌డేకు అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న విశ్వంభర టీమ్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "విశ్వంభర" పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. రాబోయే ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం కావడంతో, ఆ ప్రత్యేక సందర్భానికిగాను చిత్ర బృందం ఒక పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తోందన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా సినిమా టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న సమాచారం ఫ్యాన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
వివరాలు
విడుదల వాయిదా - కారణమేమిటి?
మొదటగా "విశ్వంభర" చిత్రాన్ని 2025 జనవరి 10న థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే నిర్మాణ పనులు అనుకున్న గడువులో పూర్తికాకపోవడంతో విడుదల తేదీని మేకర్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నుండి ఈ సినిమా గురించి పెద్దగా ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. అందుకే ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ రూపంలో కొత్త అప్‌డేట్ ఇవ్వాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
వివరాలు
మౌనీ రాయ్ & చిరంజీవి జోడి స్పెషల్ సాంగ్
ఇటీవల హైదరాబాద్‌లో బాలీవుడ్ నటి మౌనీ రాయ్, మెగాస్టార్ చిరంజీవి కలసి ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ పాటకు సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆ ఫోటోలు తర్వాత చిత్ర బృందం సోషల్ ప్లాట్‌ఫార్మ్‌ల నుండి తొలగించింది. పాట షూట్ పూర్తి అయిన తర్వాత, దాని చిన్న గ్లింప్స్‌ను మాత్రం అధికారిక వెబ్‌సైట్‌లో మేకర్స్ విడుదల చేశారు.
వివరాలు
రిలీజ్ డేట్ కూడా అదే రోజున?
ఆగస్టు 22న టీజర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. అదేవిధంగా, ఈ సినిమాలో చిరంజీవి స్వయంగా ఒక పాట పాడతారని కూడా టాక్ ఉంది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఆ పాటకు మెగాస్టార్ తన గాత్రం అందించనున్నారని వినికిడి. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. దర్శకుడు వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్-ఫాంటసీ ఎంటర్టైనర్‌లో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో మరో ముఖ్యమైన పాత్రలో అశికా రంగనాథ్ కనిపించనున్నారు. ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.