సుందరం మాస్టర్ టీజర్: రవితేజ బ్యానర్లో ప్రయోగాత్మక చిత్రం; హీరోగా మారిన వైవా హర్ష
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజ రవితేజ సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆర్ టీ టీమ్ వర్క్స్ పేరుతో మొదలైన ఈ బ్యానర్ లో చిన్న సినిమాలు తెరకెక్కుతున్నాయి.
తాజాగా ఈ బ్యానర్ నుండి వైవా హర్ష హీరోగా సుందరం మాస్టర్ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర టీజర్ ను సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసారు.
గిరిజనులకు చదువు చెప్పడానికి వైవా హర్ష పాత్ర అడవికి వెళ్తుంది. అక్కడి జనాలకు అసలు చదువే రాదని, చదువంటే ఏంటో తెలియదని వైవా హర్ష పాత్ర అనుకుంటుంది.
Details
నవ్వులతో నిండిపోయిన టీజర్
అయితే సడెన్ గా అడవిలో ఉన్న అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడి వైవా హర్షకు షాక్ ఇస్తారు. ఆ తర్వాత హీరో అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేదే సినిమా కథ.
ఈ సినిమాలో హీరోయిన్ గా దివ్య శ్రీపాద కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే నవ్వులు పంచేదిగా ఉంది. సినిమా కూడా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని అర్థమవుతోంది.
కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రవితేజ, సుధీర్ కుమార్ కుర్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా, ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇంకా వెల్లడించలేదు.