#VS11: త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ కొత్త సినిమా నేడే ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన 11వ సినిమాను దాదాపు నెల క్రితమే ప్రకటించాడు. సితార ఎంటర్ టైన్మెంట్, త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ అంజలి, దర్శకుడు క్రిష్ణ చైతన్య హాజరయ్యారు.
నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టడంతో సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ మే నెల రెండవ సగంలో మొదలవుతుందని సమాచారం.
డీజే టిల్లు భామ నేషా శెట్టి మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
Details
కొత్త లుక్ లో విశ్వక్ సేన్
ఈ పూజా కార్యక్రమానికి హాజరైన విశ్వక్ సేన్, కొత్త అవతారంలో కనిపించాడు. పెద్ద మీసాలతో కొత్తగా కనిపించాడు. హీరోయిన్ అంజలి అందంగా ఉంది.
సమాజంలోని నిబంధలను ధిక్కరించే ఈ ప్రపంచంలో తప్పొప్పులు ఉండవు అంటూ అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు. అంటే ఇదేదో డార్క్ సినిమా అయ్యుంటుందని సినిమా అభిమానులు అంచనా వేస్తున్నారు.
దర్శకుడు క్రిష్ణ చైతన్య, ఈ సినిమాను ఏ జోనర్ లో తెరెకెక్కిస్తున్నాడనేది తెలియాలంటే గ్లింప్స్, ఫస్ట్ లుక్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.
ఇటీవల దాస్ కా ధమ్కీ చిత్రంతో యావరేజ్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్, తన 11వ సినిమాతో మంచి హిట్ దక్కించుకుంటాడేమో చూడాలి.