అమెరికాలో వీరసింహారెడ్డిని దాటేసిన వాల్తేరు వీరయ్య
సంక్రాంతి సంబరంగా వచ్చిన రెండు తెలుగు సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇటు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, అటు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో మొదటిరోజు కలెక్షన్లు వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించుకుంది. ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ ఒక్కటే కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న అమెరికాలోనూ ఈ రెండు సినిమాల హవా నడుస్తోంది. ఆల్రెడీ ఈ రెండు సినిమాలు కూడా వన్ మిలియన్ క్లబ్ లో చేరిపోయాయి. ఇప్పటి వరకు వాల్తేరు వీరయ్య సినిమాకు 1.73మిలియన్ల డాలర్లు వచ్చాయని సమాచారం. వీరసింహారెడ్డి సినిమాకు 1మిలియన్ డాలర్లు వచ్చాయని తెలుస్తోంది.
రిలీజ్ కి ముందు బాలయ్య, రిలీజ్ తర్వాత చిరంజీవి
ఓవర్సీస్ కలెక్షన్లు చూస్తుంటే రెండు సినిమాలు కొత్త రికార్డులు తిరగరాస్తాయని అనిపిస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే, రిలీజ్ కి ముందు ప్రీ సేల్స్ లో బాలయ్య టాప్ లో ఉంటే, రిలీజ్ తర్వాత చిరంజీవి టాప్ లోకి వచ్చారు. వీరసింహారెడ్డి సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పాయింట్ ని చేరుకుందని చెప్పుకుంటున్నారు. ఈ దూకుడు ఇలానే కొనసాగితే అఖండ సినిమా అమెరికాలో చేసిన పూర్తి వసూళ్ళను తొందర్లోనే అధిగమించవచ్చని అభిమానులు అనుకుంటున్నారు. తమిళ చిత్రాలైన వారిసు, తునివు సినిమాల్లో వారిసు సినిమాకు 1.1మిలియన్ డాలర్ల వసూళ్ళు వస్తే, తునివు చిత్రం 1మిలియన్ కి దగ్గర్లో ఉంది. మొత్తానికి బాక్సాఫీసు వద్ద సంక్రాంతి సంబరం హై రేంజ్ లో ఉంది