
War 2 : 'వార్ 2' బడ్జెట్ బయటకు.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య నిలిచిన చిత్రం. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో ఆరో భాగంగా రాబోతోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఆగస్టు 14న, స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, నటీనటుల పారితోషిక వివరాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Details
వార్ 2 మూవీపై భారీ అంచనాలు
యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ ప్రాజెక్ట్‌ను రూ. 210 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. హృతిక్ రోషన్ తన 'మేజర్ కబీర్ ధాలివాల్' పాత్రకు రూ. 48 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ రూ. 30కోట్లు పారితోషికంగా అందుకున్నాడట. దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న అయాన్ ముఖర్జీకి రూ. 32 కోట్లు, హీరోయిన్ కియారా అద్వానీకి రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ దర్శకుడి రెమ్యునరేషన్‌కు సమానంగా ఉండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. హృతిక్-ఎన్టీఆర్ కాంబినేషన్‌పై దేశవ్యాప్తంగా భారీగా ఆసక్తి నెలకొనగా.. బాక్సాఫీస్ వద్ద ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.