తదుపరి వార్తా కథనం
WAR 2: 'వార్ 2' టీజర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా!
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 20, 2025
11:24 am
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 'వార్ 2' చిత్రబృందం ఆయన అభిమానులకు భారీ గిఫ్ట్ ఇచ్చింది.
తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన టీజర్‌లో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ లుక్‌తో కనిపించి అభిమానులను ఉర్రూతలూగించారు.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ నటిగా కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. టీజర్‌లో ఇద్దరు ప్రధాన పాత్రధారుల మధ్య సన్నివేశాలు, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి.
యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.