Deepika Padukone: మేమూ మనుషులమే… ఒత్తిడితో పని కాదు.. 8 గంటల పనికే మద్దతు తెలిపిన దీపికా!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండస్ట్రీలో ప్రస్తుతం పని గంటలపై జరుగుతున్న చర్చల మధ్య నటి దీపికా పదుకొణె మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల ఆమె వర్కింగ్ అవర్స్ కారణంగా కొన్ని భారీ ప్రాజెక్టులను వదులుకున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో అధిక పని గంటలను ఆరోగ్యానికి హానికరమని చెప్పిన దీపికా, రోజుకు ఎనిమిది గంటల పని డిమాండ్ పూర్తిగా సముచితమే అని పేర్కొన్నారు. నిబద్ధత పేరిట అతిగా వర్క్ చేయడాన్ని ప్రోత్సహించడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. 'పుట్టిన తర్వాత బాలింతలు తిరిగి పనిలోకి అడుగుపెడుతున్నప్పుడు సమతుల్యం సాధించడం ఎంత కష్టమో అర్థమైంది. నా తల్లిపై గౌరవం మరింత పెరిగిందని చెప్పారు.
Details
మరింత మద్దతు అవసరం
కొత్త తల్లులకు సమాజం మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఆమె సూచించారు. కేవలం ఎనిమిది గంటలపాటు పనిచేయడం శరీరం-మనసుకు సరిపోయే పరిమాణమే అని పేర్కొంటూ, అధిక ఒత్తిడిలో మంచి అవుట్‌పుట్ సాధ్యం కాదని ఆమె వివరించారు. తన కార్యాలయంలో కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు ఎనిమిది గంటల పని విధానమే అమల్లో ఉందని వెల్లడించారు. 'పని ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టకపోతే ప్రయోజనం లేదు. నిద్ర అత్యంత ముఖ్యం. ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెబుతాను. వినేవారికి ఇది బోరింగ్‌గా అనిపించినా.. నిజం మాత్రం ఇదే. నిద్ర, పోషకాహారం, వ్యాయామం—ఇవే నిజమైన పునాది అని అమె చెప్పారు.