Page Loader
stuntman raju death: 'మేము ప్రతి ప్రోటోకాల్‌ను పాటించాము': స్టంట్‌మ్యాన్ రాజు మరణంపై పా రంజిత్ 
'మేము ప్రతి ప్రోటోకాల్‌ను పాటించాము': స్టంట్‌మ్యాన్ రాజు మరణంపై పా రంజిత్

stuntman raju death: 'మేము ప్రతి ప్రోటోకాల్‌ను పాటించాము': స్టంట్‌మ్యాన్ రాజు మరణంపై పా రంజిత్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కథానాయకుడు ఆర్య, దర్శకుడు పా.రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న 'వేట్టువం' సినిమాకు సంబంధించి ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో స్టంట్‌మాస్టర్‌ రాజు (52) మృతిచెందారు. నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా రాజు అనుకోకుండా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే చిత్రబృందం ఆయన్ను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రాజు మృతి పట్ల దర్శకుడు పా.రంజిత్‌, ఆయన నిర్మాణ సంస్థ నీలమ్‌ ప్రొడక్షన్స్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనపై ఒక భావోద్వేగ పోస్ట్‌ను కూడా పంచుకున్నారు.

వివరాలు 

ప్రతీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రారంభించే ముందు మేము శుభం జరగాలని కోరుకుంటాం

"జులై 13న ప్రతిభావంతుడైన స్టంట్‌ ఆర్టిస్ట్‌, మాతో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న సహచరుడు మోహన్‌రాజ్‌ను కోల్పోయాం.ఆయన మరణ వార్త విన్న వెంటనే మనసు ముక్కలైంది. ఆయన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, ఆయనను ప్రేమించే అందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆ రోజు ఉదయం పక్కా ప్రణాళికతో షూటింగ్‌ను ప్రారంభించాం. ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా ప్లాన్‌ చేశాం. ఏ చర్య తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకున్నాం. ప్రతీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రారంభించే ముందు మేము శుభం జరగాలని కోరుకుంటాం. కానీ ఈసారి అంతా ఊహించని విధంగా జరిగింది. మేము ఒక విలక్షణమైన, అనుపమానమైన టాలెంట్‌ను కోల్పోయాం. ఆ ఘటన మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది."

వివరాలు 

 పూర్తి జాగ్రత్తల మధ్య షూట్‌ ప్రారంభించినా… 

"మోహన్‌ రాజ్‌ అన్న అంటే స్టంట్‌ టీమ్‌తో పాటు, మొత్తం చిత్రబృందానికి ఎంతో గౌరవమైన వ్యక్తి. స్టంట్స్‌ డిజైన్‌, ప్రణాళిక, అమలు ఇలా అన్ని విషయాల్లోనూ నిష్ణాతుడు. స్టంట్‌ డైరెక్టర్‌ దిలీప్‌ సుబ్బరాయన్‌ అన్ని రక్షణ చర్యలు తీసుకుని, పూర్తి జాగ్రత్తల మధ్య షూట్‌ ప్రారంభించినా... ఆ విధంగా జరగడం విచారకరం. ఆయన కుటుంబం, స్నేహితులు, సహచరులు, దర్శకులు గర్వపడేలా తన పని చేశారు. ఆయన పట్ల మేము ఉన్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ మారదు. మోహన్‌ రాజ్‌ అన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మా మనసుల్లో నిలిచిపోతాయి" అని నీలమ్‌ ప్రొడక్షన్స్‌ తరఫున పా.రంజిత్‌ వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పా.రంజిత్‌ చేసిన ట్వీట్