LOADING...
Janhvi Kapoor: సమానత్వంపై మాట్లాడాలి.. జాన్వీని ప్రశంసించిన ప్రియాంక చోప్రా
సమానత్వంపై మాట్లాడాలి.. జాన్వీని ప్రశంసించిన ప్రియాంక చోప్రా

Janhvi Kapoor: సమానత్వంపై మాట్లాడాలి.. జాన్వీని ప్రశంసించిన ప్రియాంక చోప్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటి జాన్వీ కపూర్ సమానత్వం గురించి నిరంతరం మాట్లాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆమె చెప్పిన మాటలకు మద్దతుగా ప్రియాంక చోప్రా స్పందిస్తూ, జాన్వీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇటీవల ముంబయిలో జరిగిన 'వీ ద విమెన్ ఆసియా' కార్యక్రమంలో జాన్వీ మాట్లాడారు. 'సమానత్వం అనేది సంభాషణలతోనే ప్రారంభమవుతుంది. మనం ఈ విషయాన్ని ఇప్పుడు అయినా తెరవెనుకగా, బహిరంగంగా చర్చిస్తే, మన తర్వాతి తరానికి దీనిపై పూర్తి అవగాహన వస్తుంది. మహిళలు శక్తివంతులు, వారిని ప్రోత్సహించాలి. నేను మహిళగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. మనల్ని మనం ప్రశంసించుకుంటూ ముందుకు సాగాలని జాన్వీ పేర్కొన్నారు.

Details

మాట్లాడేవాళ్లను ప్రోత్సహించాలి

జాన్వీ వ్యాఖ్యలతో ఏకీభవించిన ప్రియాంక చోప్రా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఇలా మాట్లాడే వాళ్లను కూడా ప్రోత్సహించాలి అని కామెంట్ చేశారు. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా జాన్వీ సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై స్పష్టంగా మాట్లాడారు. ఈ ఇండస్ట్రీలో కొనసాగాలంటే కొన్ని సందర్భాల్లో పురుష అహంకారాన్ని (Male Ego) ఎదుర్కోవాలి. నలుగురు మహిళల మధ్య నేను ధైర్యంగా నా అభిప్రాయాన్ని చెప్పగలను. కానీ అదే అభిప్రాయం నలుగురు పురుషుల మధ్య చెప్పాలంటే ఎంతో జాగ్రత్తగా, వారెవరికీ నొప్పించకుండా చెప్పాలి. దీనికి ప్రత్యేకమైన నేర్పు అవసరం. నేను కూడా ఈ విషయంలో చాలా సార్లు పోరాడానని ఆమె వెల్లడించారు.

Advertisement