LOADING...
Nara Rohith : నారా రోహిత్ ఇంట్లో మొదలైన పెళ్లి వేడుకలు
నారా రోహిత్ ఇంట్లో మొదలైన పెళ్లి వేడుకలు

Nara Rohith : నారా రోహిత్ ఇంట్లో మొదలైన పెళ్లి వేడుకలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతను ప్రేమించిన శిరీషతో గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ రోహిత్ తండ్రి మరణంతో, కొన్ని రోజులపాటు వేచిచూశారు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోతోంది, అందువల్ల జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. పెళ్లి కార్యక్రమాల ప్రారంభంగా రోహిత్ ఇంట్లో పసుపు దంచే సంప్రదాయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను శిరీష సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫోటోలు చూసిన అభిమానులు, మిత్రులు జంటకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.

Details

ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు

రోహిత్, శిరీష రెండూ 'ప్రతినిధి 2' సినిమాలో నటించారు. అప్పటి నుండే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పి అంగీకారం పొందారు. పెద్దలు కూడా ఓకే చెప్పి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. మధ్యలో రోహిత్ తండ్రి మరణంతో కొంత గ్యాప్ ఏర్పడింది. వీరి పెళ్లి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొంటున్నారు. ఈ పెళ్లికి రాజకీయ నాయకులు, కుటుంబ పెద్దలు హాజరుకానున్నట్లు సమాచారం.