Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది? GTA 6 ట్రైలర్ దెబ్బకు సర్వర్లు డౌన్.. ఫ్యాన్స్ ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
వీడియో గేమింగ్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6'(GTA VI: An Extended Look) గేమ్‌ప్లే ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రాక్‌స్టార్ గేమ్స్ సంస్థ ఈ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసింది. అయితే ట్రైలర్ విడుదలైన మరుక్షణమే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గేమర్లు నెట్ ఫ్లిక్స్ యాప్‌లోకి ఒక్కసారిగా లాగిన్ అవ్వడంతో ప్లాట్‌ఫామ్‌పై భారీగా ట్రాఫిక్ పెరిగింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు తీవ్ర ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలాయి. 4 వేలకుపైగా ఫిర్యాదులు ఆన్‌లైన్ సేవల్లో అంతరాయాలను పర్యవేక్షించే 'డౌన్ డిటెక్టర్' (Down Detector) వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. GTA 6 ట్రైలర్ విడుదలైన వెంటనే 4,000 మందికి పైగా యూజర్లు నెట్‌ఫ్లిక్స్ పనిచేయడం లేదంటూ ఫిర్యాదు చేశారు.
వివరాలు
45 నిమిషాల పాటు అంతరాయం
గత 24 గంటల గ్రాఫ్‌ను పరిశీలిస్తే.. ట్రైలర్ విడుదలైన సమయంలోనే నెట్‌ఫ్లిక్స్ సర్వర్ల వైఫల్యం గరిష్ట స్థాయికి చేరినట్లు కనిపించింది.
నెట్‌ఫ్లిక్స్‌లో తలెత్తిన ఈ సాంకేతిక సమస్య సుమారు 45 నిమిషాల పాటు కొనసాగింది. ఆ తర్వాత పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వచ్చింది.
దీంతో యూజర్లు కొంత ఆలస్యంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో GTA 6 ట్రైలర్‌ను మళ్లీ వీక్షించగలిగారు.
వివరాలు
యూజర్లు ఎదుర్కొన్న సమస్యలివే..
డౌన్ డిటెక్టర్ సేకరించిన సమాచారం ప్రకారం.. 33 శాతం మంది యూజర్లు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ అసలు ఓపెన్ కావడం లేదని ఫిర్యాదు చేశారు.
28 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
మరో 25 శాతం మంది వీడియో స్ట్రీమింగ్ కావడం లేదని, వీడియో మధ్యలోనే నిలిచిపోతోందని పేర్కొన్నారు.
అయితే దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సర్వర్ వైఫల్యంపై నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వివరాలు
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్
ట్రైలర్‌ను వెంటనే చూడలేకపోయిన గేమర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత పెద్ద ఈవెంట్ కోసం మీరెందుకు సిద్ధంగా లేరంటూ ప్రముఖ గేమింగ్ స్ట్రీమర్ ఐషోస్పీడ్(IShowSpeed)నెట్‌ఫ్లిక్స్‌ను ప్రశ్నించారు.
లైవ్ స్ట్రీమ్ సమయంలో ఆయనకు కూడా నెట్‌ఫ్లిక్స్ క్రాష్ కావడం గమనార్హం. 'GTA 6' ఎక్స్‌టెండెడ్ లుక్ దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ కూలిపోయిందంటూ ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అమెరికాకు చెందిన ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 32.5 కోట్లు (325 మిలియన్లు) కంటే ఎక్కువ మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ఇంత భారీ సబ్‌స్క్రైబర్ బేస్ ఉన్నప్పటికీ.. GTA 6 గేమ్‌ప్లే ట్రైలర్‌కు వచ్చిన క్రేజ్ ముందు నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు కూడా తలవంచక తప్పలేదు.