Page Loader
this week ott releases: ఓటిటిలో ఈ వారం ఏం చూడాలి? పూర్తి లిస్టును చూడండి!
ఓటిటిలో ఈ వారం ఏం చూడాలి? పూర్తి లిస్టును చూడండి!

this week ott releases: ఓటిటిలో ఈ వారం ఏం చూడాలి? పూర్తి లిస్టును చూడండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటిటి ప్రేక్షకులకు జూలై 11 ఒక ప్రత్యేక తేదీగా మారుతోంది. ప్రేమ, మిస్టరీ, సైన్స్‌ ఫిక్షన్‌ నుంచి యాక్షన్‌ వరకూ వివిధరకాల సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. వివిధ భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ చిత్రాలు వివిధ కథాంశాలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 11న ఏయే సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయో ఓసారి చూద్దాం.

Details

 ఆప్ జైసా కోయి - ప్రేమకు వయసుతో పనిలేదు

ఆర్‌. మాధవన్, ఫాతిమా సనా షేక్ నటించిన హిందీ సినిమా 'ఆప్ జైసా కోయి' (Aap Jaisa Koi) జులై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌కి రానుంది. 30 ఏళ్ల మహిళ, 40 ఏళ్ల వ్యక్తి మధ్య ప్రేమకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, ప్రేమకు సమాజం విధించిన పరిమితులపై ప్రశ్న వేస్తుంది. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా, వివేక్‌ సోని దర్శకుడిగా ఉన్నారు.

Details

8 వసంతాలు - ఒక ప్రేమయాత్ర

తెలుగు చిత్రం '8 వసంతాలు' (8 Vasantalu) ఇద్దరు ప్రేమికుల ఎనిమిదేళ్ల అనుభూతుల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. అనంతిక సనీల్‌కుమార్, హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా జులై 11 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

Details

డిటెక్టివ్ ఉజ్వలన్ - హాస్యం కలిపిన మిస్టరీ 

ఇంద్రనీల్ గోపికృష్ణన్ తెరకెక్కించిన మలయాళ మిస్టరీ కామెడీ 'డిటెక్టివ్ ఉజ్వలన్' (Detective Ujjwalan) నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 11 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత మే 23న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ స్పందన అందుకుంది.

Details

నరివెట్ట - ఓ రోజు ముందే స్ట్రీమింగ్

టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా 'నరివెట్ట' (Narivetta) అసలు ప్లాన్ ప్రకారం జులై 11న సోనీలివ్‌ (SonyLiv)లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ, ప్రేక్షకుల కోసం ఒక రోజు ముందే స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

Details

ఈటీవీ విన్

సంతోషం (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది అమెజాన్ ప్రైమ్ బల్లార్డ్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ యాపిల్ టీవీ ఫౌండేషన్ సీజన్ 3(ఇంగ్లీష్) వెబ్‌సిరీస్ ఆహా శారీ (తెలుగు) జులై 11 బుక్ మై షో గుడ్ వన్ (ఇంగ్లీష్) స్ట్రీమింగ్ అవుతోంది నెట్ ఫ్లిక్స్ బెటర్ లేట్ దేన్ సింగిల్ స్ట్రీమింగ్ అవుతోంది టూమచ్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది జియామ్ (ఇంగ్లీష్) స్ట్రీమింగ్ అవుతోంది