Mary Kom: సినిమాలో చూపించింది కొంతే.. నా అసలు కథ వేరే ఉంది: బయోపిక్‌పై 'మేరీ కోమ్' సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మేరీ కోమ్' బయోపిక్‌పై 12 ఏళ్ల తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఎదురైన అసలైన సంఘర్షణలు, కష్టాలు సినిమాలో పూర్తిస్థాయిలో చూపించలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నిజ జీవిత పోరాటంలో కేవలం 10 శాతం మాత్రమే ఈ బయోపిక్‌లో చూపించారని పేర్కొన్నారు. ఇటీవల 'బిగ్ బాస్ 20' హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.
వివరాలు
'మేరీ కోమ్' బయోపిక్‌పై అసంతృప్తి
2014లో విడుదలైన 'మేరీ కోమ్' బయోపిక్‌కు ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించారు.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, మేరీ కోమ్ పాత్రలో ప్రియాంక నటనకు ప్రశంసలు లభించాయి.
ఈ చిత్రంతో ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది. అయితే సినిమా విడుదలైన ఇన్నేళ్ల తర్వాత మేరీ కోమ్ దాని వాస్తవికతపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తెరపై చూపించిన కథకు, తన నిజ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులకు చాలా తేడా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆ బయోపిక్ నిజం కాదు.
వివరాలు
సీక్వెల్ అవసరం లేదన్న మేరీ కోమ్
అందులో చూపించిన దానికంటే నా జీవితంలో సంఘర్షణ చాలా ఎక్కువ. నా కష్టాల్లో కేవలం 10శాతం మాత్రమే సినిమాలో చూపించారు.
నా నిజమైన జీవిత పోరాటం, నేను చేసిన కఠోర శ్రమ గురించి తెలుసుకోవాలంటే నా ఆత్మకథ 'అన్‌బ్రేకబుల్' చదవాలి" అని మేరీ కోమ్ పేర్కొన్నారు. 'మేరీ కోమ్' బయోపిక్‌కు సీక్వెల్ తెరకెక్కించాల్సిన అవసరం ఉందా అని ఇంటర్వ్యూలో అడగ్గా ఆమె ఆసక్తికరంగా స్పందించారు.
ప్రస్తుతం తన బయోపిక్‌కు సీక్వెల్ అవసరం లేదని స్పష్టం చేశారు. నా కథ, నా ప్రయాణం గురించి ఇప్పటికే అందరికీ తెలుసు. ఇప్పుడు సీక్వెల్ అవసరం లేదు.
భవిష్యత్తు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నానని మేరీ కోమ్ బదులిచ్చారు. దీంతో ఆమె బయోపిక్‌పై మరోసారి చర్చ మొదలైంది.
వివరాలు
గతంలో ప్రియాంక చోప్రా ఏమన్నారంటే?
మరోవైపు ఈ బయోపిక్‌లో మేరీ కోమ్ పాత్రను పోషించడంపై ప్రియాంక చోప్రా కూడా గతంలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
2022లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మణిపూర్‌కు చెందిన మేరీ కోమ్ పాత్రను ఈశాన్య భారతదేశానికి చెందిన నటితో చేయించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
మేరీ కోమ్ పాత్రను ఈశాన్య రాష్ట్రానికి చెందిన నటికే ఇచ్చి ఉండాల్సింది. కానీ, ఒక నటిగా ఆ పాత్రను పోషించాలనే అత్యాశతో నేను అంగీకరించానని ప్రియాంక తెలిపారు.
ఆ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.
దాదాపు ఐదు నెలల పాటు బాక్సింగ్ శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. మేరీ కోమ్‌లా పూర్తిగా కనిపించలేకపోయినా, ఆమె స్ఫూర్తిని తనలో నింపుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
వివరాలు
12 ఏళ్ల తర్వాత మళ్లీ చర్చలోకి బయోపిక్
ఇందుకోసం మేరీ కోమ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కూడా చాలా సమయం గడిపినట్లు ప్రియాంక పేర్కొన్నారు.
'మేరీ కోమ్' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ప్రియాంక చోప్రాకు నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
అయితే ఆ సినిమాలో తన నిజ జీవిత పోరాటాన్ని పూర్తిస్థాయిలో చూపించలేదని స్వయంగా మేరీ కోమ్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు ప్రియాంక తన పాత్ర కోసం చేసిన కృషి, మరోవైపు బయోపిక్‌లో తన జీవిత వాస్తవాలు పూర్తిగా ప్రతిబింబించలేదన్న మేరీ కోమ్ వ్యాఖ్యలు.. ఈ సినిమాపై మరోసారి ఆసక్తిని పెంచాయి.