Loading...
Ramba Oorvasi Menaka Teaser : దేవకన్యలు భూమిపైకి వస్తే.. అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' టీజర్ అదిరిపోయింది!

Ramba Oorvasi Menaka Teaser : దేవకన్యలు భూమిపైకి వస్తే.. అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' టీజర్ అదిరిపోయింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లరి నరేష్‌, సురభి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. హాస్య మూవీస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్లపై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు చంద్ర మోహన్‌ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించిన చిత్రబృందం.. తాజాగా 'రంభ ఊర్వశి మేనక' టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌ను చూస్తే ఈ సినిమా ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

వివరాలు

రంభ, ఊర్వశి, మేనకగా ముగ్గురు..

ఈ సినిమాలో రాశి సింగ్‌ రంభగా, విష్ణుప్రియ ఊర్వశిగా, ప్రిషా సింగ్‌ మేనకగా కనిపించనున్నారు. ఇక వెన్నెల కిషోర్‌ ఇంద్రుడి పాత్రలో నటిస్తున్నారు.

టీజర్‌లో చూపించిన కథ ప్రకారం.. హీరోకు చిన్నతనంలో ఓ పుస్తకం దొరుకుతుంది.

ఆ పుస్తకంపై సరిగ్గా ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి, మేనకలు భూమిపైకి వచ్చి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారనే విషయం అతడికి తెలుస్తుంది.

వివరాలు

25 ఏళ్లుగా అదే పని..

ఈ విషయం తెలుసుకున్న హీరో.. రంభ, ఊర్వశి, మేనకల కోసం ఏకంగా 25 ఏళ్ల పాటు ప్రయత్నిస్తుంటాడు.

వారిని భూమిపైకి రప్పించాలనే ఉద్దేశంతో పూజలు చేస్తూ, పుస్తకంలో చెప్పిన విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తుంటాడు.

ఎట్టకేలకు అతడి ప్రయత్నాలు ఫలించి రంభ, ఊర్వశి, మేనకలు భూమిపైకి దిగుతారు.

అయితే ఆ తర్వాత హీరో జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ముగ్గురు అప్సరసలు భూమిపైకి రావడంతో ఏం జరిగింది? అనే అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.

ADVERTISEMENT