Page Loader
Mammootty: కేరళలో కలెక్షన్ల వర్షం కురిపించిన మమ్ముట్టి మూవీ.. ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే!
కేరళలో కలెక్షన్ల వర్షం కురిపించిన మమ్ముట్టి మూవీ.. ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే!

Mammootty: కేరళలో కలెక్షన్ల వర్షం కురిపించిన మమ్ముట్టి మూవీ.. ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2023
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ బాక్సాఫీస్‌ని మమ్మూటీ లేటెస్ట్ మూవీ 'కన్నూర్ స్క్యాడ్' షేక్ చేస్తోంది. యాక్షన్-కామెడీతో ఈ సినిమాను వైశాఖ్ తెరకెక్కించారు. ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.75 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రంలో కిషోర్, సన్నీ వేన్, విజయరాఘవన్, రోనీ డేవిడ్ రాజ్, అజీజ్ నెడుమంగడ్, శబరీష్ వర్మ, శరత్ సభ ఇతర నటీనటులు నటించారు. సుశిన్ శ్యామ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఈచిత్రం ఓటిటి హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. త్వరలోనే డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ తేదీని ఇంకా డిస్నీ ప్లస్ హాట్ ప్రకటించలేదు.

Details

మమ్ముట్టి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కన్నూర్ స్క్యాడ్

క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకొని ముమ్ముట్టి కెరీర్‌లోనే మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీని రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ముమ్ముట్టి మలయాళంలో మెగస్టార్ అయినా సరే ఇప్పటికీ విభిన్నమైన కథలతో సరికొత్త సినిమాలతో ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 28 లేదా నవంబర్ ఫస్ట్ వీక్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మమ్ముట్టి తెలుగులో యాత్ర 2 సినిమాతో బిజీగా ఉన్నారు.