LOADING...
Suniel Shetty: పోలీసులు తుపాకీ గురిపెట్టడంతో గజగజ వణికిపోయాను: సునీల్‌ శెట్టి
పోలీసులు తుపాకీ గురిపెట్టడంతో గజగజ వణికిపోయాను: సునీల్‌ శెట్టి

Suniel Shetty: పోలీసులు తుపాకీ గురిపెట్టడంతో గజగజ వణికిపోయాను: సునీల్‌ శెట్టి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కాంటే' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. లాస్‌ ఏంజెలిస్‌లో జరిగిన ఆ అనుభవాన్ని మర్చిపోలేనని వెల్లడించారు. తన లుక్‌ కారణంగా పోలీసులు తనను తప్పుగా అర్థం చేసుకొని, తుపాకీ గురిపెట్టిన ఘటనను వివరించారు. 9/11 దాడి, షూటింగ్‌లో అంతరాయం సెప్టెంబర్‌ 11, 2001న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన సమయంలో 'కాంటే' చిత్రీకరణ కోసం టీమ్ లాస్‌ ఏంజెలిస్‌లో ఉండేది. టీవీలో ఆ దాడి విజువల్స్ చూసి తాను ఎంతో బాధపడ్డానని సునీల్‌ తెలిపారు. ఆ ఘటన తర్వాత కొన్నిరోజులపాటు షూటింగ్ నిలిపివేశారని చెప్పారు.

Details

హోటల్‌లో దారుణ అనుభవం 

తిరిగి చిత్రీకరణ మొదలైన సమయంలో ఓ రోజు షూటింగ్ ముగిశాక, తాను రూమ్‌ తాళాలు మర్చిపోయి హోటల్‌ సిబ్బందిని అడిగానని చెప్పారు. ''నా రూమ్‌ తాళాలు మర్చిపోయాను. డూప్లికేట్‌ తాళాలు ఉన్నాయా?'' అని ప్రశ్నించగానే, ఆ సిబ్బంది ఒక్కసారిగా కేకలు వేసి పరుగెత్తారన్నారు. అతని రియాక్షన్‌కు తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. కాసేపట్లోనే పోలీసులు వచ్చి తన వైపు తుపాకీ గురిపెట్టి, ''మోకాళ్లపై కూర్చో.. లేదంటే కాల్చేస్తాం'' అని హెచ్చరించారని చెప్పారు. ఆ ఘటనలో భయంతో గజగజ వణికిపోయానని, తన చేతులకు బేడీలు వేశారని తెలిపారు.

Details

తన లుక్‌ వల్లే అపార్థం 

ఈ హడావుడి మధ్య హోటల్‌ మేనేజర్‌ వచ్చి తాను ఓ సినిమా నటుడినని, షూటింగ్‌ కోసం వచ్చానని వివరణ ఇచ్చారు. ప్రొడక్షన్‌ టీమ్ కూడా పరిస్థితిని వివరించడంతో పోలీసులు తనను వదిలారని తెలిపారు. అయితే ఆ సమయంలో తాను గడ్డంతో ఉండటమే ప్రధాన కారణమని, తన ఇంగ్లీష్‌ హోటల్‌ సిబ్బందికి పూర్తిగా అర్థం కాకపోవడంతోనే అపార్థం జరిగి ఉండొచ్చని సునీల్‌ చెప్పారు. 'కాంటే' చిత్రం 2002లో విడుదలైంది. సంజయ్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, సంజయ్‌ దత్‌, సునీల్‌ శెట్టి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా బాలీవుడ్‌లో ఓ మైలురాయి చిత్రంగా నిలిచింది.