Loading...
Namitha: పురుషులకు లేని రూల్స్ మహిళలకే ఎందుకు..? వివాహ సంప్రదాయాలపై నమిత సంచలన వ్యాఖ్యలు!
పురుషులకు లేని రూల్స్ మహిళలకే ఎందుకు..? వివాహ సంప్రదాయాలపై నమిత సంచలన వ్యాఖ్యలు!

Namitha: పురుషులకు లేని రూల్స్ మహిళలకే ఎందుకు..? వివాహ సంప్రదాయాలపై నమిత సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2026
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ, టాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి నమిత (Namitha) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహ సంప్రదాయాలు, మహిళలపై సమాజం మోపుతున్న బాధ్యతలపై ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పురుషులకు లేని కొన్ని నిబంధనలు మహిళలకే ఎందుకు ఉంటాయంటూ ప్రశ్నించారు. ''తాళి మహిళలే ఎందుకు ధరించాలి? ఆడవాళ్లే బొట్టు పెట్టుకోవాలని, సంప్రదాయాలు పాటించాలని ఎందుకు ఆశిస్తారు? పురుషులకు లేని ఈ నిబంధనలన్నీ మహిళలకే ఎందుకు?'' అని నమిత ప్రశ్నించారు. భర్త దీర్ఘాయుష్షు కోసం మహిళలు పాటించే వరలక్ష్మీ వ్రతం వంటి ఆచారాలపైనా ఆమె స్పందించారు. ''నా భర్త సురక్షితంగా ఉండాలని నేను ఉపవాసం ఉంటాను.

వివరాలు

సోషల్ మీడియాలో తీవ్ర చర్చ

కానీ, భార్య క్షేమం కోసం భర్త కనీసం ఏడాదిలో ఒక్క రోజైనా కేటాయించాలనే నియమం ఉందా? అలాంటిదేమీ లేదు. సమాజం అలాంటివి ఎందుకు సృష్టించలేదు? అన్ని నిబంధనలూ మహిళలకే ఎందుకు?'' అని ఆమె ప్రశ్నించారు.

మహిళలు తాళి ధరించాలనే నిబంధన ఏ గ్రంథాల్లోనూ లేదని నమిత అభిప్రాయపడ్డారు. ''ఇవన్నీ సమాజం సృష్టించినవే. ఎందులోనూ ఇలాంటి నిబంధనలు లేవని ఆమె పేర్కొన్నారు.

నమిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

వివాహ సంప్రదాయాలు, మహిళలపై ఉన్న సామాజిక అంచనాలపై ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కాగా, నమిత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.

ADVERTISEMENT