Harish Shankar: 'భవదీయుడు భగత్ సింగ్' ఎందుకు నిలిచిపోయింది..? క్లారిటీ ఇచ్చిన హరిష్ శంకర్!
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ కమర్షియల్ సినిమాల పల్‌సును బాగా అర్థం చేసుకున్న దర్శకుడిగా హరిష్ శంకర్ ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఆయన వీరాభిమాని. పవన్‌ను అభిమానులు వెండితెరపై ఎలా చూడాలని కోరుకుంటారో అచ్చం అలాగే చూపించడంలో హరీష్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఖుషి సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఆ సినిమాలో సిద్ధు, మధు పాత్రల మధ్య నడిచే ఈగో క్లాష్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదే పాయింట్‌ను ఆధారంగా తీసుకుని హరీష్ శంకర్ ఒక కథను సిద్ధం చేసుకున్నారట.
Details
భావోద్వేగాలు చుట్టూ కథ సాగుతుంది
ఆ కథ ప్రకారం 'ఖుషి' క్లైమాక్స్‌లో పెళ్లి చేసుకున్న సిద్ధు, మధు కొన్నేళ్ల తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోతారు. కానీ విధి వశాత్తూ వారిద్దరూ ఒకే కాలేజీలో లెక్చరర్లుగా పని చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకే చోట పని చేస్తూ ఒకరినొకరు ఎదుర్కొంటూ ఉండే ఆ జంట మధ్య తలెత్తే ఈగోలు, పంతాలు, భావోద్వేగాలు చుట్టూ కథ సాగుతుందని హరీష్ శంకర్ వివరించాడు. ఈ కథపై దాదాపు ఏడాది పాటు పని చేసిన ఆయన, దీనిని ఒక ప్రత్యేకమైన లవ్ స్టోరీగా తీర్చిదిద్దాలని భావించారట. దీనికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా నిర్ణయించారు. అయితే చివరికి ఆయనకు ఒక సందేహం కలిగిందట.
Details
హై వోల్టేజ్ యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్
పవన్ కళ్యాణ్ వంటి భారీ మాస్ ఇమేజ్ ఉన్న హీరో నుంచి అభిమానులు ఎక్కువగా హై వోల్టేజ్ యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశిస్తారని ఆయన భావించాడు. ఈ నేపథ్యంలో ఈగో క్లాష్ ఆధారంగా ఉండే ఈ కథ క్లాస్ ఆడియన్స్‌కు నచ్చే అవకాశం ఉన్నప్పటికీ, థియేటర్లలో ఫ్యాన్స్ ఆశించే పవర్‌ఫుల్ కమర్షియల్ అంశాలు తక్కువగా ఉంటాయని అనిపించిందట. దాంతో అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక హరీష్ శంకర్ ఆ లవ్ స్టోరీని పక్కన పెట్టేశాడు.
Details
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పవన్ కళ్యాణ్
ఆ స్థానంలో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ కథను సిద్ధం చేశాడు. ఇందులో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తరహాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా మళ్లీ లెక్చరర్లుగా కనిపించి ఉంటే ఆ మ్యాజిక్ మరోలా ఉండేదేమో అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కానీ హరీష్ శంకర్ మాత్రం అభిమానులు కోరుకునే మాస్ ఎంటర్టైన్మెంట్‌ను అందించడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.