LOADING...
Robo Shankar : భర్తకు చివరి వీడ్కోలు.. రోబో శంకర్ అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసిన భార్య
భర్తకు చివరి వీడ్కోలు.. రోబో శంకర్ అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసిన భార్య

Robo Shankar : భర్తకు చివరి వీడ్కోలు.. రోబో శంకర్ అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసిన భార్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ యాక్టర్ రోబో శంకర్ ఆకస్మికంగా మరణించగా, ఇది సినీ పరిశ్రమలో షాక్ సృష్టించింది. సినిమా సెట్‌లో అనుకోకుండా స్పృహ తప్పి పడిన అనంతరం, వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఆయన మరణంపై పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రోబో శంకర్ భార్య ప్రియాంక పరిస్థితి మాత్రం మాటల్లో చెప్పలేనంత కష్టం. నేడు నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రియాంక గుండెలు అవిసేలా ఏడుస్తూ, బాధను దిగమింగుకుని డ్యాన్స్ ద్వారా భర్తకు చివరి వీడ్కోలు పలికింది.

Details

పలువురు ప్రముఖులు సంతాపం

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రేక్షకులు, అభిమానులు దీన్ని చూస్తూ ప్రియాంక తన భర్తకు వీడ్కోలు పలికే విధంగా ధైర్యంగా వ్యవహించిందని కామెంట్లు చేస్తున్నారు. రోబో శంకర్ తమిళంలో కమెడియన్, యాక్టర్‌గా బాగా ఫేమస్ అయ్యారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి. అలాగే, ధనుష్, సూర్య, రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆయన నటించారు, ఆ సినిమాల్లో తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.