LOADING...
Rowdy Janardhana: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన్'లో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్?
విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన్'లో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్?

Rowdy Janardhana: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన్'లో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా జంటగా రూపొందిస్తున్న తాజా చిత్రం 'రౌడీ జనార్దన'. ఇటీవల విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేసింది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నటీనటుల ఎంపికపై చిత్రబృందం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమా సంబంధంగా ఫిలిం నగర్ వర్గాల్లో ఒక భారీ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన కీలక పాత్రలో కనిపించనుంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆమె విజయ్ దేవరకొండకు తల్లిగా పవర్‌ఫుల్ పాత్ర పోషించబోతోందని తెలుస్తోంది.

Details

విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్

దాదాపు దశాబ్దం తర్వాత కల్కి చిత్రంతో తెలుగు తెరపై తిరిగి హిట్ ఇచ్చిన శోభన ఇప్పుడు విజయ్ మూవీలో కీలకంగా కనిపించటం ప్రాజెక్ట్‌పై భారీ హైప్ సృష్టించింది. అదేవిధంగా సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఇందులో నటిస్తున్నారని సమాచారం. ఆయన లుక్ పూర్తిగా కొత్తగా, మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోంది. విజయ్ దేవరకొండ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో భారీ తారాగణం, పవర్‌ఫుల్ పాత్రలు, ఊహించని లుక్‌లు ఉంటుండటంతో విజయ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద మాస్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

Advertisement