
KGF 3: కేజీఎఫ్ 3లో తమిళ తలైవా..? తమిళ స్టార్ ఎంట్రీపై జోరుగా ప్రచారం!
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన KGF సిరీస్ ఎంతటి విపరీతమైన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ రెండు పార్టులతో యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. అదే విధంగా ప్రశాంత్ నీల్ కూడా ఓవర్‌నైట్ డైరెక్టర్‌గా మారి, టాప్ హీరోలతో వరుసగా పెద్ద సినిమాలు చేసే అవకాశాలను సొంతం చేసుకున్నారు.
KGF చాప్టర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరి సరికొత్త రికార్డులు సృష్టించింది.
Details
కేజీఎఫ్ 3 పై భారీ అంచనాలు
ఆ మూవీ చివర్లో సీక్వెల్ వస్తుందన్న సంకేతాలు ఉండటంతో KGF Chapter 3 పై భారీ అంచనాలు మొదలయ్యాయి.
తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్తల ప్రకారం, ఈ సీక్వెల్‌లో యశ్‌కు బదులుగా తమిళ స్టార్ హీరో అజిత్‌కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అంతేకాదు, KGF సిరీస్ లో భాగంగా అజిత్‌తో రెండు భాగాలను తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడని తమిళ మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
ఇటీవల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు విశేష స్పందన రావడం కూడా ఈ చర్చలకు బలం చేకూర్చింది.
Details
వరుస సినిమాలతో బీజీగా ఉన్న ప్రశాంత్ నీల్
అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు.
అలాగే సలార్ సీక్వెల్ పై కూడా మరింత క్లారిటీ అవసరం ఉంది. ఈ రెండు ప్రాజెక్టులకే కనీసం 2-3 ఏళ్లు పడే అవకాశం ఉంది.
ఈ క్రమంలో అజిత్‌తో సినిమా ఎప్పుడు మొదలవుతుందో, KGF 3 ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుందో స్పష్టత మాత్రం ఇంకా రాలేదు.