LOADING...
Rashmika - Vijay : విజయ్-రష్మిక నిశ్చితార్థంపై ఇవాళ క్లారిటీ వచ్చేనా? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!
విజయ్-రష్మిక నిశ్చితార్థంపై ఇవాళ క్లారిటీ వచ్చేనా? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!

Rashmika - Vijay : విజయ్-రష్మిక నిశ్చితార్థంపై ఇవాళ క్లారిటీ వచ్చేనా? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ విజయ్‌ దేవరకొండ-రష్మిక మందన్న ప్రేమ కథ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలొచ్చినా, ఇద్దరూ నోరు విప్పలేదు. అయితే సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులు, షేర్డ్‌ ఫోటోలు మాత్రం వారి బంధాన్ని సూచించేవిగా అభిమానులు భావించారు. ఇటీవల ఈ జంట నిశ్శబ్దంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ కలిసి పబ్లిక్‌గా కనిపించలేదు. తమ నిశ్చితార్థం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో అభిమానులు స్వయంగా వీరి నోటివెంటే ఆ విషయాన్ని వినాలని ఎదురుచూస్తున్నారు. ఇక నేడు రష్మిక నటించిన 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' సినిమా సక్సెస్‌ మీట్‌లో విజయ్‌ దేవరకొండ గెస్ట్‌గా హాజరవుతున్నాడు.

Details

'ది గర్ల ఫ్రెండ్' సక్సెస్ మీట్ కి గెస్ట్ గా విజయ్ దేవరకొండ

అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ సమాచారం ఇప్పటికే టాలీవుడ్‌ అంతటా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్‌లో రష్మిక-విజయ్‌ తమ నిశ్చితార్థం గురించి ఏదైనా చెబుతారా? పెళ్లి గురించి సంకేతాలు ఇస్తారా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అంతేకాక ఈ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనబడడం చాలా రోజుల తర్వాత జరగబోతోంది. ఈవెంట్‌లో వారిద్దరి ఫోటోలు బయటకొస్తే, సోషల్‌ మీడియా మొత్తాన్ని ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అభిమానులందరూ ఆ ఒక్క ఫోటో కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి నేడు జరగబోయే 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' సక్సెస్‌ మీట్‌లో రష్మిక-విజయ్‌ దేవరకొండ ఏం మాట్లాడతారో చూడాలి.