Devi Sri Prasad: 'పెళ్లి చేసుకుంటావా.. హీరో అవుతావా.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సమాధానం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'అత్తారింటికి దారేది'లోని ప్రసిద్ధ గీతం 'నిన్ను చూడగానే చిట్టి గుండె' రోడ్డు మీద నడుస్తూ సడన్‌గా రాసిన పాట అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) వెల్లడించారు. ఇటీవల ఆయన జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌షో 'జయమ్ము నిశ్చయమ్ము రా'లో అతిథిగా పాల్గొని తన సంగీత ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాపిడ్ ఫైర్‌లో జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు దేవిశ్రీ సరదాగా, హృదయపూర్వకంగా సమాధానమిచ్చారు.
Details
నీ ఎనర్జీని మ్యాచ్ చేసే హీరో ఎవరు?
దేవిశ్రీ సమాధానం: "చిరంజీవిగారు! నేను సంగీత దర్శకుడిగా మారే ముందు నుంచే ఆయన నా పాటకు డ్యాన్స్ చేయాలని కలలు కనేవాడిని. ఇప్పటికీ చిరంజీవి నా పాటకు డ్యాన్స్ చేస్తే నేనతన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాను. ఆయన ఎనర్జీ మరో లెవెల్‌లో ఉంటుంది — దాన్ని వర్ణించలేమని చెప్పారు. ఇండస్ట్రీకి వచ్చాక మర్చిపోలేని సంఘటన ఏది? దేవిశ్రీ: "మనం ఏదైనా నిజాయితీగా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని నేను నమ్ముతాను. నాకు ఇళయరాజా దేవుడితో సమానం. ఆయన్ని ఒక్కసారి అయినా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. గత సంవత్సరం ఆయన నా స్టూడియోకు రావడం నా జీవితంలో మర్చిపోలేని క్షణం," అన్నారు.
Details
మీరు ఎక్కువగా పంచుకునే వ్యక్తి ఎవరు?
దేవిశ్రీ: "సుకుమార్. ఆయన నాకు అన్నలాంటి వ్యక్తి. మా బంధం చాలా ప్రత్యేకం." ఏ పాట కంపోజ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టింది? దేవిశ్రీ: ఆర్య సినిమాలోని 'అ అంటే అమలాపురం...' పాటను రూపొందించడానికి చాలా సమయం పట్టింది. అంతకుముందు నేను 'వంగతోట మలుపు కాడా...'అనే పాట కంపోజ్ చేశాను. ఆపాట విని సుకుమార్ ఇలాంటిదే కావాలని అన్నాడు. రెండు పాటలు సూపర్ హిట్లు అయ్యాయి." హీరో అవుతావా? లేక పెళ్లి చేసుకుంటావా? దేవిశ్రీ నవ్వుతూ చెప్పారు: "పెళ్లి చేసుకుంటావా అనే ఆప్షన్ పక్కన ఏది పెట్టినా నేను ఆ ఆప్షన్నే తీసుకుంటాను. కాబట్టి మొదట హీరో అవుతాను. చాలా కథలు వస్తున్నాయి. నచ్చిన స్క్రిప్ట్ దొరికితే యాక్టర్‌గా కూడా కనిపిస్తాను."
Details
మీరు చేసిన పాటల్లో అత్యంత ఫేమస్ ఏది అని మీరు భావిస్తారు?
ఖడ్గం సినిమాలోని 'నువ్వు నువ్వు' సాంగ్. ఈ పాట ప్రేమను వ్యక్తపరచడానికి ఎక్కువగా ఉపయోగించుకుంటారు. అది నాకు చాలా ప్రత్యేకమైనది. ఇలా సరదా మూడ్‌లో సాగిన ఈ చిట్‌చాట్‌లో దేవిశ్రీ తన సంగీత ప్రయాణంలోని స్ఫూర్తిదాయక క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.